వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి



వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి


జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో ఎం.పి.లు,శాసన సభ్యులు మిషన్ భగీరథ పనుల పై తీవ్ర అసంతృప్తి


పోతిరె డ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి  3 టి.యం.సి.నీటిని డ్రా చేస్తూ జి. ఓ.203 జారీ వ్యతిరేకిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం


నల్గొండ,మే 16.దక్షిణ తెలంగాణ ప్రాంతంకు ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రాంతం కు తీవ్ర అన్యాయం జరిగేలా 
ఏ.పి.రాష్ట్రం పోతి రెడ్డి పాడు రెగ్యులేటర్ నుండి అక్రమంగా జి. ఓ 203 జారీ చేసి 3 టి.యం.సి నీటిని డ్రా చేయడం పట్ల వ్యతిరేకిస్తూ  జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం లో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ తీర్మానం చేశారు.శని వారం జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించి పంచాయతీ రాజ్,కరోనా నియంత్రణ చర్యలు, మిషన్ భగీరథ పనులు తదితర అంశాల పై సమీక్షించారు.సభ ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మాట్లాడుతూ పోతిరె డ్డిపాడు నుండి అక్రమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3 టి.యం.సి  నీటిని తరలించడం పట్ల వ్యతిరే కిస్తూ తీర్మానం చేయాలని మాట్లాడగా హజరైన సభ్యులు బల పరుస్తూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
సమావేశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి,శాసన మండలి విప్ కర్నె ప్రభాకర్, ఎం.ఎల్.సి. నర్సి రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు,నోముల నర్సింహయ్య,,
రవీంద్ర కుమార్,లు,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,లు పాల్గొన్నారు.
వేసవి లో గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ల ద్వారా రక్షిత నీరు అందించేందుకు చేపట్టిన పనులు అసంపూర్తి వలన త్రాగు నీరు రావడం లేదని పలువురు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్ల మెంట్ సభ్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ల ద్వారా త్రాగు నీరు అందించేందుకు పనులు చేస్తోందని,ఇంకా గ్రామాలకు త్రాగు నీరు అందక పోవడం శోచనీయం అన్నారు.మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు సమస్య వుంటే జిల్లా కలెక్టర్ ద్వారా పరిష్కారం చేసుకోవాలని అన్నారు.
మిషన్ భగీరథ పనులు చేసిన ఏజెన్సీ లు పూర్తి చేసిన తర్వాత 10 సం.లు మెయింటేనెన్స్ చేయాలని ఒప్పందం చేసుకున్న తర్వాత ఏజెన్సీ నీ మారుస్తే పాత కాంట్రాక్టర్ నుండి నిర్వహణ వ్యయం  కోత విధించాలని అన్నారు.దేవరకొండ,మునుగోడు నియోజకవర్గాల్లో మంచి నీటిసమస్య ఉందని,మునుగోడు,మర్రి గూడ మండలాల్లో చాలా గ్రామాల్లో కృష్ణా వాటర్  రావటం లేదని అన్నారు.దేవర కొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేవర కొండ నియోజక వర్గం లో 68 ఓ.హెచ్.ఎస్.అర్.లు పూర్తి అయినప్పటికీ గ్రిడ్ వారు కనెక్షన్ లు ఇవ్వ లేదని,మేయింటే నేన్స్ లేదు, బోర్లు కు అవకాశం లేదు,ఎప్పటి వరకు పూర్తి చేస్తారు,ఎన్ని సార్లు సమావేశాల్లో చెప్పినా ప్రయోజనం లేదని అని అన్నారు. మిషన్ భగీరథ ఎస్. ఈ.కృష్ణయ్య మాట్లాడుతూ సర్వే చేశామని 37 ట్యాంకులకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని,మిగతావి చిన్న చిన్న సమస్యలు వున్నాయని,లాక్ డౌన్ వల్ల 45 రోజులు గా టీమ్స్ పని చేయడం లేదని,టీమ్స్ వేశామని,  ఓ.హెచ్.ఎస్.అర్.పూర్తి అయినవి 10 రోజుల్లో కనెక్షన్ లు ఇస్తామని అన్నారు. శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా మంత్రి వర్యులు,జిల్లా కలెక్టర్,శాసన సభ్యులతో సమీక్షా చేసి నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి వేసవి ప్రారంభం అయి నిర్లక్ష్యం జరిగిందని అన్నారు.బోర్లు లేవు,నీళ్ళు లేవు అని,ఫిల్టర్ బెడ్స్ రెండు,మూడు సంవత్సరాల నుండి రిపేర్ చేయ లేదు,పని చేస్తున్న కార్మికులకు నెలల కొద్ది జీతాలు  లేవు, 600 మంది కార్మికుల 405 కోట్ల మేర ఈ.పి.ఎఫ్,పి.ఎఫ్. కట్టకుండా బాధ్యులైన కాంట్రాక్టర్ పై,సహకరించిన అధికారుల పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎం.ఎల్.సి . నర్సి రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ పైపు లైన్ల స్కీమ్ గా వుందని,మంచి నీళ్ళ స్కీమ్ గా మార్చాలని అన్నారు.ఖరీదైన స్కీం గా వ్యాఖ్యా నిస్తూ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేటట్లు చూడాలని అన్నారు. శాసనసభ్యులు ఎన్. భాస్కర్ రావు మాట్లాడుతూ టెయిల్ పాండ్ సెగ్మెంట్ ద్వారా నీళ్ళు ఉన్నప్పటికీ నీళ్ళు వాసన వస్తున్నాయి,ఆల్గే వచ్చినదని,టెక్నికల్ టీం కూడా పరిశీలించారని,సమస్య త్వరగా పరిష్కారం చేయాలని అన్నారు.నాం పల్లి,తిరుమల గిరి,నేరేడు గొమ్మ్మ మందాలల్లో కూడా మంచి నీరు రావటం లేదని సంబంధిత జడ్.పి.టి. సి.సభ్యులు సభ దృష్టి కి తెచ్చారు. ఇంట్రా విలేజ్ పనులు జూన్ 30 లోగా స్ట బిలైజ్ పూర్తి చేస్తామని,పెండింగ్ ఓ.హెచ్.ఎస్.అర్.లకు కనెక్షన్ లు ఇస్తామని ఎస్. ఈ.తెలిపారు.
ఎం.పి
కోమటి రెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణ మిగిలి వున్నది తొందరగా పూర్తి చేయాలని అన్నారు.బత్తాయి పంట ఆంధ్ర లో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని,మన రాష్ట్రం లో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేయుటకు  సమావేశం ద్వారా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు రావాలని అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహ లు కరోనా కట్టడి కి తీసుకున్న చర్యలు వివరిస్తూ సభ్యుల అనుమానాలు నివృత్తి చేశారు.శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావులు మాట్లాడుతూ నల్గొండ మెడికల్ కాలేజీ లో,మిర్యాలగూడ ఆసుపత్రిలో సి.టి.స్కానింగ్,అల్ట్రా సౌండ్ లేక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని,పేదల పై బారం పడకుండా జిల్లా కలెక్టర్ సి.టి.స్కానింగ్,అల్ట్రా సౌండ్ పరికరాలు రిపేర్ వుంటే వెంటనే వేయించాలని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన వైకుంఠ ధామాలు,సి.సి.రోడ్లు,పి.యం.జి.ఎస్.వై ద్వారా చేపట్టిన పనులు వివరించారు.
ధాన్యం కొనుగోళ్ల పై సభ్యులు ప్రస్తావించిన సమస్యలు జిల్లా గ్రామీణాభవృద్ధి అధికారి,జిల్లా సహకార అధికారి సమాధానం ఇస్తూ ఇంకామిగిలిన వరి దాన్యం కొనుగోళ్లు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
వర్షాకాలం పంటకు ఎరువులు,విత్తనాలు సిద్దంగా ఉన్నట్లు,మే 10 నుండి పి. ఏ.సి.ఎస్. సోసైటీ ల ద్వారా విక్రయిస్తు నట్లు తెలిపారు.
ఎక్సైజ్ శాఖ అధికారులు నాంపల్లి మండలం,ఇతర చోట్ల సీజ్ చేసిన షాప్ లు తెరచి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సంబంధిత సి. ఐ.కి పిర్యాదు చేసినట్లు తెలిపారు.ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శంకర్ మాట్లాడుతూ నిబంధనలు విరుద్ధంగా  విక్రయాలు ఉన్న దుకాణాల  పై పెనాల్టీ విధించి నట్లు,ఎం.అర్.పి.కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ  పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సమావేశం 90 రోజుల్లో నిర్వహించవలసి వున్నట్లు,కరోనా నేపథ్యం లో ముఖ్యమైన కొన్ని శాఖలు సమీక్షా చేయనున్నట్లు తెలిపారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలు సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జడ్.పి.సర్వ సభ్య సమావేశం మొట్ట మొదటి సారి గా హజరు కావడం ఆనందంగా వుందని,ముఖ్యంగా గ్రామ,మండల స్థాయి లో సమస్యలు సభ్యులు ద్వారా సమావేశం  లో ప్రస్తావన కు వస్తాయని ఆయన అన్నారు.మిషన్ భగీరథ పనుల్లో జిల్లా కొంత వెనుక బడి వున్నదని,ఇప్పటికే శాసన సభ్యులతో కలిసి,అర్.డబ్ల్యూ.ఎస్. ఈ ఈ.,డి. ఈ., ఏ. ఈ లతో సమావేశం నిర్వహించినట్లు,లాక్ డౌన్ ,కాంట్రాక్టర్ లు సమస్య వలన పనులు ముందుకు సాగ లేదని ,వచ్చే రెండు వారాల్లో శాసన సభ్యులు తెలిపిన సమస్యలు పరిష్కారం కు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఆసుపత్రి లో సి.టి.స్కాన్ ,
పేదలకు వుపయోగం  చెందేలా చూస్తానని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రం లోనే మొదటి స్థానం లో నిలిచిందని,ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు 800 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని అన్నారు.1100 కోట్ల విలువ గల పంట 95,000 మంది రైతుల నుండి కొనుగోలు చేసి 800 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోళ్లు 95 శాతం పైగా పూర్తి అయినట్లు,ఇంకా పి. ఏ.పల్లి,కట్టాంగూర్,నార్కట్ పల్లి మండ లాల్లో కొనుగోళ్లు చేయ వలసి ఉందని అన్నారు.
జిల్లాలో వానాకాలం  ఎరువుల ,విత్తనాల కొరత లేదని,పి.ఈ.సి.ఎస్.లు ద్వారా రైతులు పంటకు కావలసిన ఎరువులు కొనుగోలు చేసుకునేలా సభ్యులు రైతులకు తెలుపాలని అన్నారు.తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం నుండి 4,57,356 తెల్ల రేషన్ కార్డ్ దారులకు గాను 27 వేల మందికి బ్యాంక్ అకౌంట్ ఆక్టివ్ లేని వారికి పోస్ట్ ఆఫీస్ ల ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చని అన్నారు.ఇంకా 9800 మంది తీసుకోలేదని పోస్ట్ ఆఫీస్ కు చౌక ధర దుకాణాలు వారీగా లిస్ట్ అంద చేస్తామని అన్నారు.కరోనా తర్వాత అన్ని శాఖల వారీగా సమీక్షిస్తా నని చెప్పారు.సమావేశం లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జడ్
పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి , డిప్యూటీ సి.ఈ. ఓ. సీతా కుమారి,డి.సి. ఓ.అర్.శ్రీనివాస మూర్తి,వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీ దేవి, జిల్లా పౌరసరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వర్ రావు,ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్