గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దు - జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్గొండ,మే 20..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.ఉపాధి హామీ కింద పని కోరిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి. ఓ.లు,ఏ.పి. ఓ.లు,, పంచాయతీ కార్యదర్శులు,ఈ జీ ఎస్ సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు,నర్సరీలు నిర్వహణ,మొక్కల సంరక్షణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామ పంచాయతీ ల్లో ఒక లక్షా 53 వేల 290 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని,ప్రతి జి.పి.లో సరాసరి 197 మంది హజరు అవుతున్నారని,సరాసరి ప్రతి జి.పి.లో 250 మంది వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఒక్కొక్కరికి సరాసరి 137 రూ. ల వేతనం వస్తుందని,వచ్చే వారం నాటికి సరాసరి వేతనం165 రూ.లు చెల్లించేలా పనులు కల్పించాలని సూచించారు.
నర్సరీల లో మొక్కలు జి.పి.గ్రీన్ ప్లాన్ ప్రకారం పెంచాలని,పంచాయతీ కార్యదర్శులు మొక్కలు సంరక్షణ బాధ్యత వహించాలని అన్నారు.ముఖ్యంగా పండ్ల మొక్కలు పెంపకం చేపట్టాలని,జామ,ఉసిరి,బొప్పాయి,మునగ,నిమ్మ లాంటి మొక్కలు ప్రతి నర్సరీలో పెంచాలని అన్నారు.ప్రైమరీ బెడ్స్ ద్వారా కొన్ని మొక్కలు పెంచాలని,పూల మొక్కలు కూడా తప్పనసరిగా పెంచాలని అన్నారు.జీవామృతం ప్రతి నర్సరీ లో తయారు చేసి సాయంత్రం వేళలో నీరు పెట్టే ముందు ప్రతి మొక్కకు అందించాలని అన్నారు.జీవామృతం వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకోక పోతే మొక్కలు చనిపోయే ప్రమాదం వుందని అన్నారు. వారంలో సంబంధిత అధికారులు ప్రతి నర్సరీ ని సందర్శించి ఎం.పి. ఓ.లు మొక్కల స్థితిగతుల పై నివేదికలు పంపించాలని ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సస్పెండ్,రిజెక్ట్ పేమెంట్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయని,కొన్ని మండలాల్లో ఎక్కువగా ఉన్నాయని,పేమెంట్ లకు సంబంధించిన వివరాలను కార్యదర్శులకు ఇచ్చి క్లియర్ చేయాలని అన్నారు.ప్రతి గ్రామంలో ఎస్.బి.యం.కింద కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మించాలని అన్నారు. టైప్ 1 కింద ఈ నెలాఖరు లోగా వినియోగించు కొవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.కె.వీర బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment