అమృత్ పథకం పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
మిర్యాలగూడ,నల్గొండ పట్టణం లో అమృత్ పథకం,దేవరకొండ పట్టణం లో మిషన్ భగీరథ పనుల పై సమీక్ష
నల్గొండ,మే 27. నల్గొండ,మిర్యాలగూడ పట్టణాల లో చేపట్టిన అమృత్ పథకం కింద చేపట్టిన పనులు,దేవరకొండ అర్బన్ మిషన్ భగీరథ ఆన్యూటీ మోడ్ పనుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నల్గొండ,మిర్యాలగూడ పట్టణం లలో అమృత్ పనులు,దేవరకొండ పట్టణంలో మిషన్ భగీరథ అర్బన్ పనుల పై నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ మున్సిపల్ కమిషనర్ లు,పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్ భాస్కర్ రావు,రవీంద్ర కుమార్ లు హజరయ్యారు.
దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ఆన్యూటీ మోడ్ లో పట్టణం లో చేపట్టిన పనులు అసంపూర్తి గా వున్నట్లు తెలిపారు.పట్టణం లో ఒకట వ వార్డ్ లో త్రాగు నీరు సరిగా రావటం లేదని,పనులు అసంపూర్తి గా వున్నట్లు,మార్కెట్ యార్డ్ పరిధి లో ఇండ్లకు త్రాగు నీరు రావటం లేదని, స్లూయిజ్ వాల్వ్ ఏర్పాటు చేయాలని అన్నారు.పైపు లైన్ వేసిన రోడ్డు కట్టింగ్ రిపేర్ చేయాలని అన్నారు.చాలా ప్రాంతాల్లో నల్లాలు బిగించాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రోడ్డు కటింగ్ పునరుద్దరణ కు అదనపు నిధులు మంజూరు కు అంచనాలు వేసి ఈ. ఎన్.సి.కి పంపించాలని ఈ ఈ ని ఆదేశించారు.మిషన్ భగీరథ కింద అసంపూర్తి పనులు పూర్తి చేయాలని అర్. డబ్ల్యు.ఎస్.అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మిర్యాలగూడ పట్టణంలో అమృత్ కింద చేపట్టిన పనుల్లో 11 లింకేజి లు కొత్త గా వేసిన పైపు లైన్ నుండి,పాత పైపు లైన్ లు కలిపేందుకు,25 కి. మీ.అదనపు పైపు లైన్ మంజూరు కు ఈ.ఎన్.సి కి అనుమతి కు లేఖ రాయాలని శాసన సభ్యులు భాస్కర్ రావు కోరారు.పట్టణం లో 8000 నల్లా కనెక్షన్ లు వున్నట్లు,అదనంగా 8000 నల్లా కనెక్షన్ లు మంజూరుకు ఈ.ఎన్.సి కి రాయాలని, పట్టణం లో మిషన్ భగీరథ ట్యాంకు లకు నిర్దేశించిన విధంగా 10 ఎం.ఎల్.డి కి తక్కువగా 6 ఎం.ఎల్.డి మాత్రమే సరఫరా అవుతున్నట్లు,త్రాగు నీరు పచ్ఛ గా వస్తున్నట్లు తెలిపారు. రోడ్ కట్టిం గ్ అయిన చోట అదనపు నిధులు మంజూరు కు చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ పబ్లిక్ హెల్త్,అర్. డబ్ల్యూ.ఎస్.అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ లో కూడా పైపు. లైన్ వేసినప్పుడు రోడ్డు కటింగ్ అయిన చోట పునరుద్దరణకు అదనపు నిధుల మంజూరు కు ప్రభుత్వం కు ప్రతి పాదనలు పంపించాలని కోరారు.320 కి. మీ.పైపు లైన్ వేయడం పూర్తి చేసినట్లు,నల్గొండ మున్సిపాలిటీ లో కలిసిన శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో త్రాగు నీరు అందించాలంటే 50 కి. మీ.అదనపు పైపు లైన్ వేయాలని అన్నారు.63 లింకేజిలు జూన్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.ఇంటర్ కనెక్షన్ లు పూర్తి చేయాలని ఆదేశించారు.జోనల్ పద్దతి లో త్రాగు నీరు అందించాలని సమావేశం లో ఆయన కోరారు.సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఈ ఈ కందుకూరి వెంకటేశ్వర్లు,అర్.డబ్లూ.ఎస్. ఈ ఈ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ లు,ఏజెన్సీ లు,మున్సిపల్ డీ. ఈ.లు పాల్గొన్నారు.
Comments
Post a Comment