దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం

ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం


తెలుగు రాష్ట్రాలకు భారీ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తుపాను ముప్పు పొంచి ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇది మరింత బలపడి సుమారుగా మే 7 వ తేదీన ఆగ్నేయబంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.


కాగా..ఇది మే 7 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.


తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


మరో వైపు ఆంధ్ర ప్రాంతానికి భారీ తుపాన్ గండం పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. తుఫాన్ పేరు ఎంఫాన్ (AMPHAN) గా వాతావరణ శాఖ నామకరణం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఒకవైపు కరోనా తో అల్లాడుతున్న ప్రజలకు, మరోవైపు తుపాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!