రైతులకు సలహాలు,సూచనలు అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర - నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్
రైతులకు సలహాలు,సూచనలు అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర - నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్
వ్యవసాయ రంగంలో వస్తున్న వస్తున్న మార్పులు,లాభసాటి వ్యవసాయ సాగుకు క్షేత్ర స్థాయిలో రైతులకు సలహాలు,సూచనలు అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏ.ఈ. ఓ.లు) వ్యక్తిత్వ వికాస శిక్షణ,ఒత్తిడి అధిగమించడం పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ది కి,రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారులు నియామకం జరిగినప్పటి నుండి ఎటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ, స్ట్రెస్ మేనేజ్ మెంట్ పై శిక్షణ నివ్వలేదని,రానున్న రోజుల్లో వ్యవసాయ అధికారుల పై మరింత ఒత్తిడి వుంటుందని, ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ పరంగా ఒత్తిడి అధిగమించి మరింత సమర్థవంతంగా సేవలు అందించే వీలు వుంటుందని అన్నారు.వ్యవసాయ శాఖ హైద్రాబాద్ నుండి వ్యక్తిత్వ వికాస నిపుణులు మనోహర న్,రామ కృష్ణ లు ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులు, ఏ. ఈ. ఓ.లకు స్ట్రెస్ మేనేజ్ మెంట్, లైఫ్ స్కిల్స్ పై శిక్షణ నివ్వడం మంచి ప్రయత్నమని,రానున్న రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా పునరంకితమై పని చేస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇతర శాఖల అధికారుల కు కూడా నిర్వహించే ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగ పడిందని,ఉద్యోగ బాధ్యతలు ఒత్తిడి అధిగమించి నిర్వర్తిస్తా మని,రైతులకు సేవలు అందిస్తామని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రైతులు పంటలు వేసి నష్ట పోకుండా వానాకాలం సీజన్ నుండి ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ద్వారా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించాల ని వ్యవసాయ శాస్త్రజ్ఞులు,నిపుణులు సలహాలు తీసుకొని అమలు చేయనున్నట్లు తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రభుత్వం ,వ్యవసాయ శాఖ సూచించిన విధంగా జిల్లాలో నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని అన్నారు. యాసంగి లో జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు,ఇందుకు కృషి చేసిన వ్యవసాయ,పౌర సరఫరాలు,సహకార,జిల్లా గ్రామీణాభివృద్ధి,మార్కెటింగ్ అధికారులను ఆయన అభినందించారు. ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ ఏ.డి.హుస్సేన్ బాబు,నల్గొండ ఏ.డి.సుధా రాణి,హలియా ఏ.డి.జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment