జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి



జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి*


*రాత్రి భోజనం తో పాటు,నేటి నుండి రోగుల బంధువులకు మధ్యాహ్న భోజనం అర్.డి. ఓ. చేతుల మీదుగా ప్రారంభించిన నల్గొండ ఆర్గ్( ఎన్.అర్. ఐ.ఫోరం) సభ్యులు*
నల్గొండ,మే 10. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆస్పత్రి లో రోగుల బంధువులు ఇబ్బంది పడకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్.అర్. ఐ. లు సేవా దృక్పథం తో రాత్రి భోజనం తో పాటు,మధ్యాహ్నం భోజన సౌకర్యం సమ కూర్చటం పట్ల నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి వారి సేవలను అభినందించారు.ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి లో రోగుల బంధువుల ఆకలి తీర్చాలని నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.


     ఎన్.అర్. ఐ. పోరం కో ఆర్డినేటర్ మిట్టపల్లి సురేష్ గుప్తా మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టి అమెరికా లో స్థిరపడిన NRI లు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి తోడ్పాటు అందించాలని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 రోజుల నుంచి రాత్రి సమయం లో భోజనం ఏర్పాటు చేసి హాస్పిటల్ కి వచ్చే రోగుల బంధువుల ఆకలిని తీర్చుతునట్లు, ని, మధ్యాహ్నం సమయం లో ఇబ్బంది పడడంతో ఈ రోజు నుంచి మధ్యాహ్నం సమయం లో కూడా భోజనము ఏర్పాటు చేసి ఆకలిని తీర్చడం అభినందనీయమని అన్నారు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారుగా 6000 మందికి నిత్యావసర సరుకులు, కరోనా పై పోరాడుతున్న సిబ్బందికి రక్షణ కవచాలు PPE kits ,మాస్కులు, ధర్మో స్కానర్లు జిల్లా ప్రభుత్వ యంత్రాoగానికి అందించామని అన్నారు.మాతృ దేశం మీద ఉన్న అభిమానం తో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను పుట్ట శాంతి కుమార్, సుధీర్ రాజు, మిట్ట పల్లి సురేష్ గుప్తా లు పర్యవేక్షిస్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్