టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం


టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  



 ప్రపంచమంతా కరోనా దరిమిలా  ఎక్కడి  కక్కడ  కొత్త పద్దతులతో  జీవించాల్సిన  పరిస్థితులు  వచ్చాయని , తప్ప ని పరిస్థితులలో  నూతన  పద్దతుల ను  అవలంభించడం  జరుగుతుందని మంత్రి  జగదీశ్  రెడ్డి   చెప్పారు . ఇందులో  భాగంగానే  టెలి కాన్ఫరెన్స్ ద్వారా   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  నిర్వహించు కోవడం  జరిగిందని  , ఇందుకు  సహకరించిన  మునిసిపల్  కౌన్సిల్  సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపారు . శుక్రవారం  103 కోట్ల 14 లక్షల 65 వేల తో  2020 -21 ఆర్థిక  సంవత్సరానికి  గాను  బడ్జెట్ అంచనా , 2019 -20  సంవత్సర  సవరింపు  బడ్జెట్  అంచనా  ఆమోదానికి  గాను శుక్రవారం  కౌన్సిలర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్  బడ్జెట్   సమావేశం   నిర్వహించారు .  నల్గొండ  మున్సిపల్  కార్యాలయం లోని  సమావేశ  మందిరం  నుండి  నిర్వహించిన  ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా  హాజరైన  రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి  గుంత కండ్ల  జగదీశ్  రెడ్డి   మాట్లాడుతూ  కరోనా  నేపథ్యం లో  కొత్త  పద్దతుల  ద్వారా  ఎక్కడికక్కడ  కార్యక్రమాలు  నిర్వహించడం  జరుగుతుందని , ఇందులో  భాగంగానే   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్  సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా  నిర్వహించుకోవడం  జరిగిందని  చెప్పారు . వ్యాక్సిన్  కనుగొనే దాకా  కరోనా  మనం  జీవించాల్సిందే నని, కరోనా  మనకు మీటర్  దూరం  లోనే  ఉండనే  విషయాన్ని  ప్రతి  ఒక్కరు  గమనించి  జాగురత తో   వ్యవహరించాలని  సూచించారు .  కరోనా  మీద  చేసే  యుద్దానికి  మనం  ప్రభుత్వానికి  బాసట గా  నిలవాలన్నారు . త్వరలోనే  జోన్ల  విషయం లో  కేంద్ర   ప్రభుత్వం  నిర్ణయం  తీసుకొని  జోన్ల పద్ధతి  ఉంచాలా  , ఎత్తివేయాలా అనే  అంశం పై  నిర్ణయం  తీసుకుంటుందని  చెప్పారు .ఏ ప్రాంతం లో నైతే  కరోనా  వైరస్  వ్యాపిస్తుందో  అక్కడ  ప్రజలే  స్వచ్చందంగా  నిర్బంధం పాటించుకునే విదంగా  సిద్ధం  కావాలన్నారు . నల్గొండ లో  ప్రారంభం లోనే  కరోనా  ను  గుర్తించి , కరోనా  కట్టడికి  పకడ్బందీ  చర్యలు చేపట్టి  పూర్తి  స్థాయి లో  కరోనా ను  కంట్రోల్  చేయడం  జరిగిందన్నారు .   కరోనా  కట్టడి లో మునిసిపల్  కార్మికుల , సిబ్బంది  సేవలు  అభినందనీయమన్నారు .  మున్సిపల్  కౌన్సిల్  సభ్యులు  సైతం  ఎక్కడికక్కడ  సహకరిస్తూ  కరోనా  కట్టడికి  కృషి  చేశారని  ఇందుకు  వారికీ   కృతజ్ఞతలు  తెలిపారు .  రెడ్  జోన్ల  లో  సైతం పని  చేసిన  ఘనత  మున్సిపల్  సిబ్బంది కి  ఉందని , సహకరించిన  నల్గొండ  పట్టణ ప్రజలకు   కృతజ్ఞతలు  తెలిపారు .  కరోనా  కట్టడి  విషయం లో  పార్టీ ల  కతీతంగా  కృషి  చేశారో  నల్గొండ పట్టణ అభివృద్హి కి సైతం  పార్టీల  కతీతంగా  ముందుకు  రావాలని  పిలుపు  నిచ్చారు . జిల్లా  కలెక్టర్  ప్రశాంత్  జీవన్ పాటిల్  మాట్లాడుతూ  మునిసిపల్  నూతన   చట్టం  గురించి  ప్రతి  ఒక్కరు  అవగాహన కలిగి  ఉండాలని , నూతన  చట్టం  10  శాతం గ్రీన్ ప్లాన్  ఉండాలని  సూచించారు . బడ్జెట్ లో  ఒకటి  బై  మూడవ వంతు  నిధులు   విలీన  గ్రామాల  అభివృద్ధికి  కేటాయించడం  జరిగిందని , అలాగే వెనుక బడిన ప్రాంతాలకు , దళిత  వాడల అభివృద్ధికి  అధిక  నిధులు  బడ్జెట్ లో కేటాయించడం  జరిగిందని  చెప్పారు .  మునిసిపాలిటీ లో ఖర్చు ఎక్కువగా  ఉంది  ..ఆదాయం  తక్కువగా  ఉందని  ఆదాయ వనరులు  పెంచుకునేలా  ప్రణాళిక  సిద్ధం  చేయాలని అధికారులను  ఆదేశించారు .  నల్గొండ  ఎమ్మెల్యే  కంచర్ల  భూపాల్  రెడ్డి  మాట్లాడుతూ సి .యం.  కె .సి ఆర్ , మంత్రులు  కె .టి .ఆర్ . , జగదీష్ రెడ్డి  ల  సహకారం  తో  నల్గొండ పట్టణాన్ని  అన్ని  విధాలుగా  అభివృద్ధి  చేసేందుకు  కృషి చేయడం  జరుగుతుందని  ఇందుకు  సంబందించిన  పనులు  సైతం  ప్రారంభ మయ్యాయని  చెప్పారు .   మునిసిపల్  కౌన్సిలర్ల తో పాటు నల్గొండ పట్టణ  ప్రజలు   అభివృద్ధికి  సహకరించాలని    కోరారు . అంతకు  ముందు  ఇటీవల  మృతి  చెందిన కౌన్సిలర్  దుబ్బ కాంతమ్మ ఆత్మకు  శాంతి  కలగాలని ఆకాంకిస్తూ రెండు  నిముషాల   మౌనం పాటించి  శ్రద్ధాంజలి   ఘటించారు . నల్గొండ  మునిసిపల్  కార్యాలయం  లోని  కౌన్సిల్  హాల్  నుండి మునిసిపల్  చైర్మెన్  మందడి సైది  రెడ్డి  అధ్యక్షత     కౌన్సిలర్లకు  టెలి కాన్ఫరెన్స్  ద్వారా  జరిగిన   ఈ సమావేశం లో  జిల్లా  పరిషత్  చైర్మెన్  బండా నరేందర్ రెడ్డి , అదనపు   కలెక్టర్  రాహుల్  శర్మ ,  మునిసిపల్  కమిషనర్  భూక్యా  దేవ్  సింగ్ , వైస్  చైర్మెన్  అబ్బగొని  రమేష్  గౌడ్ , మునిసిపల్  అధికారులు  కిరణ్  కుమార్ ,  శంకర్ , ముర్తుజా , నర్సింహా  రెడ్డి ,  పద్మ ,  తదితరులు పాల్గొన్నారు .


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్