దగ్గు,జ్వరం,జలుబు,గొంతు నొప్పిమందులు అమ్మినచో రోగుల వివరాలను మెడికల్ షాప్ వారు రికార్డు నిర్వహించి మునుసిపల్ కమీషనర్ కు అందచేయాలి- నల్గొండ జిల్లా కలెక్టర్
దగ్గు,జ్వరం,జలుబు,గొంతు నొప్పిమందులు అమ్మినచో
రోగుల వివరాలను మెడికల్ షాప్ వారు రికార్డు నిర్వహించి మునుసిపల్ కమీషనర్ కు అందచేయాలి- నల్గొండ జిల్లా కలెక్టర్
నల్గొండ,మే 1. జిల్లాలో మెడికల్ షాప్ యజమానులు కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యం లో దగ్గు,జ్వరం,జలుబు,గొంతు నొప్పిమందులు అమ్మినచో రోగుల వివరాలు తప్పనిసరిగా తమ వద్ద రికార్డ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.మెడికల్ షాప్ యజమానులు దగ్గు,జలుబు,జ్వరం,గొంతు నొప్పి మందులు విక్రయించిన రోగి పేరు,చిరునామా,ఫోన్ నెంబర్ వివరాలు,మందుల వివరాలు తమ పరిధిలో మున్సిపల్ కమిషనర్ లకు విధిగా అంద చేయాలని అన్నారు.మున్సిపల్ కమిషనర్ లు మెడికల్ షాపుల వారీగా నుండి ప్రతి రోజూ వివరాలు సేకరించి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కు అంద చేయాలని ఆదేశించారు.పై ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘంచినచో విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51,అంటువ్యాధుల చట్టం 1897 సెక్షన్ 3, ఐ పి సి సెక్షన్ 188 ప్రకారం చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment