సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు:

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు:


జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,


ఎస్.పి. ఏ.వి.రంగనాథ్*



నల్లగొండ,మే6. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తూ   అనేక సదలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసినందున నిర్మాణ రంగంలో పనులకు ఇబ్బంది లేకుండా సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా కు వినియోగ దారులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి. ఏ.వి.రంగ నాథ్ లు తెలిపారు.ప్రభుత్వ పనులకు,నిర్మాణ పనులకు సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచేందుకు అవకాశం కల్పించిందని, ఈ దశలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి ఇక్కడ పని చేసేలా వారికి నచ్చ చెప్పి వివరించాలని,పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎస్పీ  ఏ.వి.రంగనాథ్ లు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల తహశీల్దార్ లు,పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వలస కార్మికులు,సాండ్ టాక్సీ,స్మశాన వాటికలు,ఇంకుడు గుంతల నిర్మాణం,మున్సిపాలిటీ లో దుకాణాలు తెరవడం,తదితర విషయాలపై కలెక్టర్,ఎస్.పి.లు నిర్దేశం చేశారు.ప్రభుత్వ పనులకు ఆటంకం లేకుండా ఇసుక సరఫరా కు ప్రాధాన్యత నివ్వాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస కార్మికులు  నిర్మాణ రంగం,ఇటుక బట్టీ లు,దుకాణాలు,పరిశ్రమలు పనిచేసే వారిని ప్రభుత్వం అనుమతించిన మేరకు స్వస్థలాలకు వెళ్లి క్వారం టైన్,వైద్య పరీక్షలు ఇతర నిబంధనలు పాటించ వలసి వుంటుందని, అనుమతించిన  ప్రదేశాల్లో పని చేసేలా వారికి వివరించాలని చెప్పారు.గ్రామ పంచాయతీ ల్లో స్మశాన వాటికల నిర్మాణం,సోక్ పిట్స్ నిర్మాణ పనులు కొనసాగించాలని అన్నారు. మున్సిపాలిటీ ల్లో నిత్యావసర,మందుల దుకాణాలు యదావిధిగా పనిచేస్తాయని,మిగతా దుకాణాలు మున్సిపల్ కమిషనర్ లు  దుకాణాలకు నంబరింగ్ వేసి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 50 శాతం మేర తెరచేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.సాయంత్రం 7 గంటల నుండి కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు.పాన్,గుట్కా,టొబాకో ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వి.సి.లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అర్.డి. ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,రోహిత్ సింగ్, లిం గ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్