వానా కాలామ్ పంటకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నాయి - రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి


వానా కాలామ్ పంటకు రైతులకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.


గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంటకు ఎరువులు,విత్తనాలు సరఫరా, యాసంగీ ధాన్యం కొనుగోళ్లు సమీక్షించారు.జిల్లాలో ఎరువులు రెండు లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల వానాకాలం సాగుకు అవసరం కాగా అందులో 80,000 మెట్రిక్ టన్నులు యూరియా,36,000  డి. ఏ.పి.,66,000 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, యూరియా,డి. ఏ.పి.,కాంప్లెక్స్ ఎరువులు 29,000 మెట్రిక్ టన్నులు అందు బాటులో వుందని వ్యవసాయ అధికారులు మంత్రికి వివరించారు. ఇందు లో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా,2700 మెట్రిక్ టన్నుల డి. ఏ.పి.,13600 కాంప్లెక్స్ ఎరువులు అందు బాటులో వున్నట్లు వారు వివరించారు.ఎప్పటి కప్పుడు వచ్చిన ఎరువుల ర్యాక్ పి. ఏ.సి.ఎస్.,డీలర్ లకు పొజిషన్ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు 1900 మెట్రిక్ టన్నులు ఎరువులు డీలర్ లు,పి. ఏ.సి.ఎస్., అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా రైతుల కు విక్రయించి నట్లు అధికారులు వివరించారు.వానాకాలం సీజన్ లో ఎరువులు,విత్తనాలు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.


రైతులకు వరి విత్తనాలు 85000 క్వింటాళ్ల అవసరం కాగా 32000 క్వింటాళ్ల విత్తనాలు అందు బాటులో వున్నాయని, జీలుగ,జనుము విత్తనాలు 65 శాతం సబ్సిడీ తో పీ. ఏ.సి.ఎస్.సొసైటీ ల ద్వారా విక్రయం చేస్తున్నట్లు తెలిపారు. పత్తి 13 లక్షల 95 వేల ప్యాకెట్ లు అవసరం కాగా రెండు లక్షలు ప్యాకెట్లు అందుబాటు లో వున్నాయని వివరించారు.
*రికార్డ్ స్థాయి లో ధాన్యం కొనుగోళ్లు*
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 1250 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో చెల్లించినట్లు  మంత్రి తెలిపారు. యాసంగీ ధాన్యం ప్రతి గింజ రైతుల
నుండి కొనుగోలు చేస్తామని మంత్రి వివరించారు.నల్గొండ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 700 కోట్ల రూ.లు రైతులకు చెల్లింపులు జరిగినట్లు వివరించారు. ఈ సమావేశం లో శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాధరి కిషోర్,వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి, ఏ.డి.హుస్సేన్ బాబు,జిల్లా సహకార అధికారి అర్.శ్రీనివాస మూర్తి,జిల్లా ఉద్యాన అధికారి సంగీత లక్ష్మి,మార్క్ పెడ్ డి.యం.సునీత,మార్కెటింగ్ ఏ.డి. అలీం తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్