మద్యం దుకాణాలు ఖాళీ
దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్ళీ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు మద్యం కొనుగోలుకు విపరీతంగా ఎగబడ్డారు. ఇక తిరుపతి పట్టణంలో మద్యం దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది. ఒక్కో షాపులో పది నుంచి పదిహేను లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలైన్లలోనే ఉన్నారు. కాగా.. కొన్ని చోట్ల మద్యం సిబ్బంది మద్యం దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. రేపు డిపో నుంచి మద్యం స్టాక్ వచ్చాకే అమ్మకాలు జరుపుతామని దుకాణదారులు తెలిపారు. నేడు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.
Comments
Post a Comment