లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు


న్యూఢిల్లీ: ఈనెల 3వ తేదీతో దేశవ్యాప్తంగా ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ  తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 4 నుంచి 17వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. తాజా ఆదేశాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాల రాకపోకలపై నిషేధం యథాప్రకారం కొనసాగుతుంది. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదు. అంతర్ జిల్లా, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రిత్వా శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్