ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్
ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్
విశాఖ: తన కుమారుడు సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డిపై తనకు, తన కుమారుడికి నమ్మకం లేదని సుధాకర్ తల్లి కావేరి భాయ్ అన్నారు. అదే విషయం తన కొడుకు కూడా డాక్టర్‌తో చెప్పాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెంటల్ లేని తన కొడుకును పిచ్చాసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడని.. అలాంటి వ్యక్తిని తీసుకువెళ్లి మెంటల్ ఆస్పత్రిలో ఎలా ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వంపై కూడా తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు.
ఇవన్నీ చూస్తుంటే తన కొడుక్కు ప్రాణహాని ఉందనిపిస్తోందని కావేరి భాయ్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్న నాలుగు పేజీల లెటర్ రాశారని, అలాంటి వ్యక్తిని మెంటల్ ఆస్పత్రిలో ఎందుకు ఉంచారో అర్థంకావడంలేదన్నారు. సరైన చికిత్స ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు. సరైన చికిత్స చేయపోవడంతో తన కొడుక్కి కొత్త సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. తీర్పు వచ్చిన వెంటనే సుధాకర్‌ను వేరే ఆస్పత్రికి మారుస్తామని కావేరి భాయ్ స్పష్టం చేశారు.
Comments
Post a Comment