వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్


కట్టంగూర్,నార్కట్ పల్లి,మే 3.కట్టంగూర్ మండలం అయిటి పాముల, ఈదులూర్ గ్రామాల్లో,నార్కట్ పల్లి తుమ్మల గూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదివారం తనిఖీ చేశారు.ధాన్యం కొను గోలు కేంద్రాల్లో వరి ధాన్యం ఎంత పరిమాణంలో ఉంది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే ట్యాగ్ చేసిన సంబంధిత మిల్లులకు పంపించాలని ఆదేశించారు.మిల్లుల వద్ద అన్ లోడింగ్ సమస్య లేకుండా చూడాలని,కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు పంపడం లో ఎటువంటి సమస్య లేకుండా చూడాలని పౌరసరఫరాల అధికారి ని ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో గన్ని ల సమస్య,ధాన్యం మిల్లులు రవాణా చేయడం లో కాంట్రాక్టర్ లు లారీ లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల డి.యం.ను ఆదేశించారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీ దేవి,జిల్లా సహకార అధికారి రాబిరాల శ్రీనివాస మూర్తి,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్