ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

 


ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్


వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో యాసంగి  వరి ధాన్యం కొనుగోళ్ళపై ఆయన సమీక్షించారు. యాసంగి లో వరి ధాన్యం సాగు అధికంగా జరిగినందున ఇంకా వరి ధాన్యం వస్తున్13 మండలాల వ్యవసాయ అధికారులు,పౌర సరఫరా శాఖ డి. టి.లు, ఏ.పి.యం.లు,పి. ఏ.సి.ఎస్.సి.ఈ. ఓ.లతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో స్టాక్,ఇంకా ఎంత ఉంది తదితర అంశాలు సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని లు కొరత వుంటే సరఫరా చేస్తామని,ఇతర జిల్లాల మిల్లులకు ట్యాగింగ్ చేసే అవకాశం వుందని,నాణ్యతా ప్రమాణాలు,తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ   రోహిత్ సింగ్ , నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ,దేవర కొండ ఆర్డీఓ లింగ్యా నాయక్,  జిల్లా  పౌర సరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు,  జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీదేవి.       తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్