నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్



తిప్పర్తి, మా డ్గుల పల్లి,దామరచర్ల మం డలాల్లో నర్సరీలు సందర్శించిన జిల్లా కలెక్టర్



.గ్రామ పంచాయతీ ల్లో నర్సరీ ల్లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ తిప్పర్తి  మండలం రాయిని గూడెం,మా డ్గులపల్లి మండలం కొత్త గూడెం,దామరచర్ల మండలం రాజ గట్టు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు సందర్శించారు.
నర్సరీ ల్లో మొక్కల పెంపకం, జెర్మినేషన్,గ్రామ గ్రీన్ ప్లాన్,వైకుంఠ దామం,కంపోస్ట్ షెడ్ ల పనుల ప్రగతి పై మండల ,గ్రామ అధికారులతో చర్చించి ఆదేశాలు,సూచనలు జారీ చేశారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించాలని,హరిత హరం కార్యక్రమం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జి.పి
కి ఒక నర్సరీ ఏర్పాటు చేసిందని అన్నారు.ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు హరిత హరం పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని,గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు పెంచుతూ మొక్కలు చని పోకుండా మొక్కలకు వాటరింగ్,చేయాలని అన్నారు.పల్లె ప్రగతి లొ గ్రామంలో తిరిగి గ్రామ ప్రజల నుండి వివరాలు సేకరించి గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు సిద్దం చేస్తున్నారా, ఏ ఏ మొక్కలు  రకాలు,సంఖ్య అధికారులతో సమీక్షించారు.అడిగి తెలుసుకున్నారు.గ్రామం లో గ్రీన్ ప్లాన్ ప్రకారం నర్సరీ ల్లో మొక్కలు పెంచి హోం స్టెడ్,అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్,పొలాల్లో బండ్ ప్లాంటేషన్ కు వానాకాలం మొక్కలు నాటేందుకు సిద్దం చేయాలని అన్నారు.
మొక్కలు బాగా పెరిగేలా జీవామృతం మొక్కలకు పట్టించా లని,మొక్కలు పోషకాలు లభించి బాగా పెరుగుతాయని అన్నారు.జి.పి.నిధుల నుండి డ్రమ్ములు ఏర్పాటు చేసుకో వాలని, జీవామృతం తయారీ చేసి అందులో నుండి మొక్కలకు ఎరువుగా వేయాలని అన్నారు.నర్సరీల వద్ద వివరాలు తెలిసేలా ఐరన్ తో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కొత్త గూడెం గ్రామంలో గుల్ మోహర్ లాంటి పొడవు గల చెట్లు రహదారుల వెంబడి రెండు కి.మీ .అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని సూచించారు మండల పంచాయతీ అధికారి తమ పరిధిలో అన్ని నర్సరీలు సందర్శించి మొక్కలు వివరాలు,స్థితి గతులు జి.పి.వారీగా నివేదిక అందచేయాలని అన్నారు.వాస్తవ పరిస్థితిని నివేదించాలని,తప్పుడు వివరాలు సమర్పించ వద్దని తెలిపారు.మొక్కలు ఎక్కడైనా తక్కువ గా వుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.గ్రామ కార్యదర్శి,ఎం.పి.డి. ఓ.లు మొక్కల బాధ్యత వహించాలని అన్నారు. సేవకుల చెల్లింపులు పై తెలుసుకున్నారు.
గ్రామంలో వైకుంఠ ధామం లు,కంపోస్ట్ షెడ్ ల నిర్మాణం ల పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. నిర్మాణం లు వెంటనే పూర్తి చేయాలని, సిమెంట్,హార్డ్ వేర్ షాప్ లు తెరచి నట్టు,ఇసుక సరఫరా కు ఇబ్బంది లేదని,కూలీలు,మేస్త్రీలు ఏర్పాటు చేసుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు.కొత్త గూడెం గ్రామంలో వైకుంఠ ధామం భూమి రిజిస్ట్రేషన్ పూర్తి నాలుగు రోజుల్లో చేసి నిర్మాణాలు మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,ఎం.పి.డి. ఓ.లు.,తహశీల్దార్ లు,ఎం.పి. ఓ.లు, సర్పంచ్ లు,గ్రామ అధికారులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్