బీజేపీ దళిత మహిళ నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల పై కేసు నమోదు చేయాలి- బంగారు శృతి బిజెపి జాతీయ దళిత మోర్చా ఈసీ మెంబర్
బీజేపీ దళిత మహిళ నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల పై కేసు నమోదు చేయాలి- బంగారు శృతి బిజెపి జాతీయ దళిత మోర్చా ఈసీ మెంబర్
చాదరఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ దళిత మైనర్ బాలికను ఎమ్మెల్యే బాలాల అనుచరుడు షకీల్ అత్యాచారానికి ఒడికట్టాడు. ఆ బాలికను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి జాతీయ దళిత మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు శృతిని ఎమ్మెల్యే బాలాల 'థర్డ్ క్లాస్ వాలి' అని దూషించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజెపి దళిత నాయకులు తీవ్రంగా స్పందించారు.
తనను బాలాల దూషించడంతో స్వయంగా బంగారు శృతి శనివారం చాదరఘాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్ అంటున్నాడు కానీ వాళ్ళ పార్టీ నాయకులు దళితులను అత్యాచారం చేస్తున్నారు మరో ఎమ్మెల్యే దూసిస్తున్నాడు ఓవైసీ మాత్రం నోరు మెదపడం లేదు ఇది అన్యాయం అన్నారు.
నన్ను దూషించిన ఎమ్మెల్యే బాలాల పై పోలీసులు sc,st కేసు నమోదు చేయాలి లేకపోతే రాష్ట్రంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతాము కేంద్ర sc,st కమిషన్ దృష్టికి తీసుకెళుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భగవంత్ రావు,నర్సింహా, రూప్ రాజ్,అలె జితేందర్, నిరంజన్ యాదవ్,సురేందర్ రెడ్డి,కరుణా సాగర్,వినోద్ గౌడ్,నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment