పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్గొండ,మే 18 .రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ సూచించిన విధంగా వానాకాలం లో పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.సోమవారం హైద్రాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ,రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్ లు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు,సహకార,ఉద్యాన శాఖ,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వానాకాలం సీజన్ లో నియంత్రిత పద్దతిలో ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయడం పై సుదీర్ఘంగా వివరించి జిల్లా కలెక్టర్ లు,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో జిల్లా పరిస్థితులు తెలుసుకొని సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ గత సంవత్సరం వానాకాలం సీజన్ లో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు,ఇందు లో 6.7లక్షలు ఎకరాలు పత్తి,3.4 లక్షల ఎకరాల్లో వరి,మిగతా కందులు,పెసర్లు,వేరు శెనగ పంటలు సాగు చేసినట్లు తెలిపారు.వరి పంట జిల్లా కార్డు ననుసరించి సాగు చేసేందుకు రైతులకు విస్తృతంగా అవగాహన కలిగిస్తా మని తెలిపారు. పత్తి,కందులు,వేరు శెనగ పంటలు వేసేలా రైతులకు ప్రోత్సాహం చేయనున్నట్లు తెలిపారు.జిల్లాలో వ్యవసాయ క్లస్టర్ వారీగా 142 రైతు వేదికలు నిర్మాణం కు గాను 108 క్లస్టర్ లలో స్థలాలు గుర్తించినట్లు తెలిపారు.జిల్లాలో ఖాళీ గా వున్న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్ట్ లు భర్తీ చేస్తామని,జిల్లాలో 142 ఏ. ఈ. ఓ. ల పోస్ట్ లకు 12 ఖాళీ లు వున్నాయని,వాటిని భర్తీ చేస్తామని అన్నారు.రైతులు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వినియోగం వలన భూమి లో భాస్వరం పెరుగుతుంటుంద ని,వీటి బదులు పచ్చి రొట్ట,జనుము, జీలుగ, పాస్పరస్ సాల్యు బుల్ బ్యాక్టీరియా గురించి రైతులు వినియోగం చేసేలా విస్తృతంగా అవగాహన కు ప్రణాళిక బద్దంగా కృషి చేస్తామని అన్నారు.వ్యవసాయ యాంత్రీకరణ మండల,క్లస్టర్ వారీగా ఇన్వెంటరీ తయారు చేస్తామని అన్నారు.చెరువుల నుండి మట్టి తీసుకు వెళ్లేలా ప్రోత్సాహం కల్పిస్తామని,ఎరువులు పి. ఏ.సి.ఎస్. ద్వారా రైతులకు అందు బాటులో వుంచి నట్లు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయ విధానం,నియంత్రిత పంటల సాగు పై సోదాహరణంగా పంటల సాగు వివరాలు,వానాకాలం సీజన్ లో ఏ పంట ఎంత వేయాలి గణాంకాలు తో వివరించారు.ముఖ్యంగా వరి పంట ఎక్కువగా సాగు అవుతోందని,వరి ధాన్యం బియ్యం గా మార్చే శక్తి లేదని, వానా కాలం సీజన్ లో వరి వంగడాలు ప్రభుత్వం ,వ్యవసాయ శాఖ, సూచించిన విధంగా రైతులు పంట వేయాలని అన్నారు.రైతులు విత్తన డీలర్ల వద్ద వరి విత్తనాలు కొనుగోలు చేయ వద్దని, వరి విత్తనాల డీలర్ లు వరి విత్తనాలు విక్రయం చేయరాదని అన్నారు.ప్రభుత్వమే వారం రోజుల్లో సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు సరఫరా చేస్తుందని ముఖ్య మంత్రి చెప్పారు.రెండు రోజుల్లో జిల్లా అవసరాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏ పంట ఏ రకం ఎంత వేయాలి,ఎంత పరిమాణంలో వేయాలి వివరించ నున్నట్లు తెలిపారు.మేలు రకం విత్తనాలు సరఫరా,సాగు పద్ధతులు,దిగుబడులు,పండించిన పంటకు ధరలు రాబట్టి రైతులకు మేలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి ఏ రాష్ట్రం చేయని విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేస్తోందని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా రైతులు అసంగటితంగా వున్నారని,రైతులు వారి ధరలు నిర్ణయించ లేరని,మధ్య దళారులు లాభ పడుతున్నారని అన్నారు.ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని,కరోనా వుందని ప్రభుత్వమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు.ఇది ప్రభుత్వ పని కాదని అన్నారు.మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలి,రైతులకు విజ్ఞానం కావాలి, ఇష్ట మొచ్చిన విధంగా ఇష్టమచ్చిన పంట వేస్తే ధర రాదని అన్నారు.రైతులు సంగటితం కావాలి,కలెక్టర్ లు,వ్యవసాయ అధికారులు వచ్చే 15 రోజులు వ్యవసాయం పై దృష్టి పెట్టాలి,ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుందని అన్నారు.వ్యవసాయ విశ్వ విద్యాలయం,శాస్త్రజ్ఞులు,రాష్ట్ర స్థాయిలో చర్చించి నట్లు, ఏ పంట వేస్తే లాభ సాటి , ఏ రకం, ఏ వంగడాలు వేయాలి.జిల్లా ల వారీగా రెండు రోజుల్లో తెలియ చేస్తాం అన్నారు. వరి తగ్గించి పత్తి,కంది,కూరగాయలు,పసుపు,సోయా బీన్, ఎండు మిర్చి తదితర పంటలు జిల్లా పరిస్థితుల కనుగుణంగా వేయాలి అన్నారు.మొక్క జొన్న వర్షా కాలం లో వేయవద్దని,మొక్క జొన్న వేస్తే రైతు బందు సహాయం ప్రభుత్వం అందించ డం జరగదని సి.యం.స్పష్టం చేశారు.కందులు ప్రభుత్వం కొను గోలు చేస్తుందని, పత్తి సి. సి. ఐ.కొనుగోలు చేస్తుందని అన్నారు. పత్తి,కందులు ఇతర విత్తనాలు అందు బాటులో వున్నట్లు,వరి మాత్రం ప్రభుత్వం సరఫరా చేస్తుందని,ఎవరూ అమ్మవద్ధు,కొన వద్దని స్పష్టం చేశారు.ఎరువులు రైతులు పి. ఏ.సి.ఎస్. ల ద్వారా జూన్ పంటకు కొనుగోలు చేసుకోవాలని అన్నారు.ప్రతి రైతుకూ రైతు బంధు అందిస్తామని అన్నారు.రైతులకు ప్రపంచంలో,దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఎకరానికి 5000 రూ.లు రైతు బంధు సాయం,24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్,రైతు ఛని పోతే ఎల్. ఐ.సి.ద్వారా 5 లక్షలు రూపాయలు పరిహారం ఎన్నో సదు పాయాలు,రైతు ను రాజు చేయాలని చేస్తోందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం సాధించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర పంటల విధానం కూడా అందరూ సంగటితంగా విజయవంతం చేసి రాబోయే రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అద్భుత,గొప్ప వ్యవసాయ రాష్ట్రం గా ఒక నమూనా గా రూపొందు తుందని అన్నారు.
రాబోయే నాలుగు,ఐదు నెలల్లో జిల్లాల్లో రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేయాలని,ఆరు నెలల్లో రైతులు సమావేశాలు జరుపుకోవాలని,చర్చించే వేదిక గా ఉండాలని అన్నారు. ఏ. ఈ. ఓ.లు వర్షాకాలం సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడానికి రైతులను సమాయత్తం చేయాలని అన్నారు.వరి మాత్రం దొడ్డు రకం,సన్న రకం ప్రభుత్వం సూచించిన విధంగా వేయాలి.తెలంగాణ సోనా రకం మంచి డిమాండ్ ఉన్న రకం ప్రభుత్వం సరఫరా చేస్తుందని అన్నారు. రైతులు చెరువుల్లో మట్టి తీసుకు వెళ్ళటానికి రెవెన్యూ అధికారులు ఆటంకం కలిగించ వద్దని,రైతుల పొలాల్లో భూ సారం పెరుగుతుందని,చెరువు సామర్థ్యం పెరుగుతుంది అని అన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో పాటు,అదనపు కలెక్టర్ లు వి.చంద్ర శేఖర్,రాహుల్ శర్మ, జిల్లా రైతు బందు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్ ,జిల్లా వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి,జిల్లా సహకార అధికారి అర్.శ్రీనివాస మూర్తి,జిల్లా ఉద్యాన శాఖ అధికారి సంగీత లక్ష్మి,జిల్లా మార్కెటింగ్ ఏ.డి. అలీం,వ్యవసాయ శాఖ ఏ.డి.హుస్సేన్ బాబు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment