రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్

 



 


రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్



 రెవెన్యూ శాఖ కోర్ట్ కేసులకు సంబంధించి  కౌంటర్ లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో అర్.డి. ఓ.లు,తహశీల్దార్ లతో సమావేశం నిర్వహించి రెవెన్యూ పరంగా హైకోర్టు లో దాఖలు చేసిన పెండింగ్ కేసుల ను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించి హై కోర్ట్ లో దాఖలు చేసిన కేసుల కు సంబంధించి కౌంటర్ లు దాఖలు చేయాలని తహశీల్దార్ లు,అర్.డి. ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల ననుసరించి నియోజక వర్గాలలో ఒక్కొక్క నియోజక వర్గంలో గోదాముల నిర్మాణం కు 15 నుండి 20 ఎకరాలు గుర్తించి నట్లు,గుర్తించిన స్థలం గోదాం ల నిర్మాణం చేయుటకు అనువుగా వున్నదా లేదా కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,(నల్గొండ),లింగ్యానాయక్,(దేవర కొండ),తహశీల్దార్ లు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్