జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేశారు.(ఇది వరకే 10 వేల నిత్యావసర కిట్లు పంపిణీ జరిగింది) మసబ్ ట్యాంక్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఈ దఫా మరో పది వేలు నిత్యవసర కిట్లు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మంత్రి సతీమణి శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి ,గౌతం రావు ,దీపక్ రెడ్డి ,ఛాయా దేవి లతో కలిసి ప్యాకింగ్ తీరును పరిశీలించారు. ప్రతి కిట్లో 5 కిలోల మేలురకం రైస్, ఒక కిలో పప్పు ఒక లీటర్ నూనె, పసుపు,కారం,చింతపండు- ఒక్కొక్కటి పావు కిలో చొప్పున, పికిల్ పాకెట్ -150గ్రామ్స్, ఎనర్జీ జ్యుస్ -1 లీటర్, మాస్కులు-4 ఉన్నాయి. మొత్తం 9 వస్తువులతో 10 వేల కిట్ల ప్యాకింగ్ బంజారా పంక్షన్ హాళ్ళో అయింది. సురక్షితంగా ప్యాకింగ్ అవుతున్న తీరును పరిశీలించిన శ్రీమతి కావ్యా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ ఇంకా పొడిగించడంతో జంటనగరాల్లోని పేద ప్రజలకు ఈ కిట్లు అందించాలని కిషన్ రెడ్డి నిర్ణయించారని, అందుకే అన్ని జాగ్రత్తలతో ప్యాకింగ్ సిబ్బందితో కిట్లను సిద్ధం చేసామని తెలిపారు. ఈ కిట్లను రేపు మధ్యాహ్నం నగరం నలుమూలలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. ఇప్పటికే నిత్యావసర కిట్లతో పాటు 2 దఫాలుగా నాణ్యమైన తాజా కూరగాయలు 44 టన్నులు నగరానికి తెప్పించి పేద ప్రజలకు పంపిణీ చేయించామని, అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ ఒమెన్ గ్రూప్స్ తో ప్రత్యేక కాటన్ క్లాత్ మాస్కులు కుట్టించి పేద ప్రజలకు పంపిణీ చేయించడం జరుగుతుందని కావ్య తెలిపారు. ఢిల్లీలో దేశవ్యాప్త కమాండ్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్న మంత్రి కిషన్ రెడ్డిగారు ప్రతినిత్యం తన హైదరాబాద్ కార్యాలయ సిబ్బందితో,పార్టీ క్యాడర్ తో,స్వచ్చంద సంస్థలతో చర్చిస్తూ జంట నగర ప్రజల కోసం పని చేస్తున్నారని ,ఈ కష్ట కాలంలో కరోనాను జయించడమే మన అందరి లక్ష్యమని కావ్య కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ కు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపారు. అలానే ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్నా డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Post a Comment