తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మూడు జిల్లాల్లో పర్యటన
తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మూడు జిల్లాల్లో పర్యటన
తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అనంతరం అక్కడి నుండి సంగారెడ్డి జిల్లాకు, ఆ తర్వాత వికారాబాద్ జిల్లాకు వెళతారు. ఆయా జిల్లాల్లోనూ రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి నెలా ప్రభుత్వం రూ .308 కోట్లను జిపిలకు విడుదల చేస్తోంది. పర్యటన సందర్భంగా పారిశుధ్యం, డంప్ యార్డులు, శ్మశానవాటిక, నర్సరీ, టికెహెచ్‌హెచ్‌పై సిఎస్ దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ ఈ పర్యటన చేపట్టారు. గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
Comments
Post a Comment