భారత్ కోలుకుంటోంది
భారత్ కోలుకుంటోంది.
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైరస్ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది._
_ఈ రోజు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో ఈ ఒక్కరోజే అత్యధికంగా 49,310 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,945కి పెరిగింది. వీరిలో 8,17,209 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 30,601 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరణాల రేటు కూడా 2.38శతానికి పడిపోవడం విశేషం. ప్రస్తుతం 4,40,135 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పరీక్షలు చేశారు. దేశంలో మొత్తం ల్యాబ్‌లలో 897 ప్రభుత్వ లేబొరేటరీలు కాగా.. 393 ప్రైవేటు సెక్టార్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.
Comments
Post a Comment