దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు లబ్ది చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి??
దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం
ఆర్యవైశ్య నాయకులకేనా లబ్ది?
పేద ఆర్యవైశ్యులకు లబ్ది చేకూర్చరా?
కార్పొరేషన్ ఏమైంది?
10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి?
దుబ్బాక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా చాటడంతో జిహెచ్ఎంసి ఎన్నికలో ఆర్యవైశ్యులు ఎక్కడ దూరం అవుతారనో అని ఆర్యవైశ్యు లకు మూడు పెద్ద పెదవులే ఇచ్చారు. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే ఆయినప్పటికి పేద వైశ్యులకు ఏమి దక్కిందని పలువురు ఆర్యవైశ్య నాయకులు పెదవి విరుస్తున్నారు.
ముగ్గురు నాయకులకు పదవులు లిస్తే అది వారి ఎదుగుదలకే ఉపయోగపడుతుందని , పేద ఆర్యవైశ్యులు ఏమి లాభం జరగదని అంటున్నారు వైశ్యులు. అధికార పార్టీలో చక్రం తిప్ప గలిగే అగ్రనాయకులు పదవులు ఇప్పించుకోవడంలో విజయం సాధించారని ఇది ఆర్య వైశ్య జాతి ఎంతో సంతోషించ విషయమే అయినప్పటికీ సామాన్య తరగతి ఆర్యవైశ్యులకు లాభం జరిగే లాగా ఈ సమయంలోనే అధికార పార్టీ ప్రకటించిన కార్పొరేషన్ కూడా సాధించి లాభం చేకూర్చాలని అభిప్రాయ పడుతున్నారు. ఇదే కాకుండా పేద ఆర్యవైశ్యులకు విద్య, ఉద్యోగాల్లో లాభం జరగాలంటే మోడీ ప్రకటించిన 10 శాతం అగ్రవర్ణ రిజర్వేషన్ అమలు పరిచేలా వత్తిడి తేవాలని, ఇదే మంచి సమయమని ఆ దిశగా అధికార పార్టీలో ఆర్యవైశ్య అగ్రనాయకులు అడుగులు వేయాలని సామాన్య ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారు.
Comments
Post a Comment