రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి
రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి జయంతి సూపారిపాలన దినోత్సవం సందర్బంగా ఒక్క క్లిక్ తో దేశంలో 9 కోట్ల రైతులకు 18 వెల కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నేరుగా 2 కోట్ల మంది రైతులతో వ్యవసాయ చట్టాల పై వర్చువల్లో ముఖ ముఖ లో పాల్గొన్న కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక్ష ప్రస్సారం చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బీజేపీ కార్య దర్శి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రధాన మంత్రి మోడీ లక్ష్యమని, దేశంలో వ్యవసాయంలో సమృద్ధి సాధించడం, రైతులకు మేలు చేయడానికి ఈ చట్టల ఉద్దేశ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యామసుందర్, నూకల వెంకట నారాయణ రెడ్డి, జిల్లా కోశాధికారి విద్యాసాగర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సీతారాంరెడ్డి, , పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు, రాఖీ, మంగళంపల్లి కృష్ణ, బలరాం , మాజీ కౌన్సిల్లర్లు నారాబోయిన చంద్రమోహన్ రాష్ట్ర మరియు జిల్లా పట్టణ నాయకులు, మహిళా మోర్చా నాయకుర్రాళ్ళు పాల్గొన్నారు.
Comments
Post a Comment