చిన్న పత్రికలకు అన్ని విధాలా సహకరిస్తా - ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
చిన్న పత్రికలకు అన్ని విధాలా సహకరిస్తా - ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్గొండలో జరిగిన తెలంగాణ స్మాల్ అండ్ మీడియం అసోసియేషన్ నల్గొండ జిల్లా సమావేశంలో నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ చిన్న మరియు మధ్యతరహా పత్రికలకు అన్ని విధాలా సహకరించి ఆదుకుంటామని తెలిపారు. అరుహులైన చిన్న పత్రికల వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్ధిక సహకారం ఇప్పస్తామని తెలిపారు. నల్గొండ నియోజవర్గాన్ని ముఖ్యన్గా నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు భూపాల్ రెడ్డికి, నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి గార్లకు చిన్న పత్రికల తరపున ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ చిన్న పేపర్లకు ప్రకటనల కొరకు నిరాహారదీక్ష కు సిద్ధమని, అవసరమైతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో అందరం నామునేషన్లు వేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర twju రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, భాస్కర్, యాతకుల లింగయ్య, జిల్లా జర్నలిస్టుల సంఘ ప్రధాన కార్యదర్శి గుండగొని జయ శంకర్, చిన్న పత్రిక ల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, గౌరవ అధ్యక్షుడు మధనా చారి, ప్రధాన కార్య దర్శి గంగదార వెంకటేశ్వర్లు, కోశాధికారి వేముల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు మోహన్ రెడ్డి, భూపతి రాజు, నరహరి, సుభాష్ రెడ్డి, కంది సూర్య నారాయణ, ముత్తయ్య, శోభన్, గుడిపాటి శ్రీను, పొట్టుముత్తు అశోక్, భూపతి లక్ష్మి నారాయణ, మత్తయ్య, స్వామి, జగదీష్ చారి, షరీఫ్, కంబాలపల్లి కృష్ణ, అసిఫ్, ఖదీర్, జలీల్, మద్ది శంకరయ్య, రాగినయ్య, జగదీష్, , మరియు పలువురు చిన్న పేపర్ల ఎదుటర్లు తదిరలు పాల్గొన్నారు.
Comments
Post a Comment