ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.
తెలంగాణ రాష్ష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రబోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.
తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు గారి ఆధ్వర్యంలో నేడు అనగాతేదీ 31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల మినిస్టర్స్ క్వార్టర్స్ నందు బోయనపల్లి వినోద్ కుమార్ గారిని వారి నివాసంలో కలిసి చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక రాక చిన్న పత్రికలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని , కావున చిన్న పత్రికల కు ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా కోరడం జరిగింది. అన్ని విషయాలు వినోద్ కుమార్ గారికి వివరంగావివరించగా సానుకూలంగా స్పందిస్తూ సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడిన తర్వాత సీఎం దృష్టి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యూసఫ్ బాబు ,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ , ఉపాధ్యక్షులు అగస్టీన్ , రాష్ట్ర నాయకులు బి.వెంకటయ్య జూన్ షహీద్ ,అఫ్రోజ్,ఖాసిం తదితర పత్రికా సంపాదకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment