ఉప్పల పౌండేషన్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓ బృహత్తర కార్యక్రమం
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల పౌండేషన్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఓ బృహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మి అనే దివ్యాంగురాలికి, సూర్యనారాయణ అనే కంటి చూపులేని వ్యక్తి వివాహానికి శ్రీమతి ఉప్పల స్వప్న బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉప్పల ఫౌండేషన్ సేవలు నేడు దివ్యాంగులకు సైతం అందడం పట్ల ఫౌండేషన్ ను సర్వత్రా అభినందిస్తున్నారు.
Comments
Post a Comment