మోడీ తీసుకొచ్చిన Ews రిజెర్వేషన్ అమలు చేస్తాం, *100 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

*మోడీ తీసుకొచ్చిన Ews  రిజెర్వేషన్ అమలు చేస్తాం,

*100 కోట్లతో ఆర్యవైశ్య  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం

 - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్




10 శాతం రిజర్వేషన్లు, ఆర్యవైశ్య  కార్పొరేషన్   ఏర్పాటుకు కేసీఆర్ కు భగవంతుడు సద్బుద్ధి కల్పించాలని కరీంనగర్ లో ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సా  శ్రీనివాస్   ఆధ్వర్యంలో సకృత్ చండి మహా యాగం నిర్వహించారు. ఈ  దీక్ష కార్యక్రమానికి  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కేసీఆర్ వెంటనే మోడీ తీసుక వచ్చిన  10శాతం రిజర్వేషన్లు,  ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఆయన  విఫలం అయితే  2023 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే  రిజెర్వేషన్లు అమలు చేస్తామని, 100 కోట్ల తో ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని  తెలిపారు.   కుల సంఘాల నాయకులు కులాల కొరకు పనిచేయకుండా,  కులాల అభివృద్ధికి కృషి చేయాలనే విషయాన్ని  మరిచి పోయి  కేసీఆర్ మోచేతి నీళ్లు త్రాగుతూన్నారని  విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి,   ఐక్య వేదిక  ప్రధాన కార్యదర్శి పడకంటి రమేష్, రామేశం,  కార్యాచరణ కమిటీ నాయకులు మరియు వేల సంఖ్యలో ఆర్యవైశ్య సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్