మే 13 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య'

 


మే 13 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' 


మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' టీజర్ విడుదల చేసిన కొన్ని గంటలకే, ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మే 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. చిరంజీవికి మే నెల బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి.  'ఖైదీ'తో చిరంజీవి స్టార్ గా మారిన తరువాత మే నెలలో ఆయన నటించిన "వేట, జగదేకవీరుడు - అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు" చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో 'వేట' అపజయాన్ని చవిచూడగా, 'మెకానిక్ అల్లుడు' సో సోగా ఆడింది. ఇక చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' చిత్రం 1990 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ తరువాతి సంవత్సరం అంటే 1991లో అదే తేదీకి విడుదలైన విజయబాపినీడు 'గ్యాంగ్ లీడర్' బాక్సులు బద్దలు చేసింది. 'గ్యాంగ్ లీడర్' ఆ రోజుల్లో ఘనవిజయం సాధించడమే కాదు, ఆ సినిమా వంద రోజుల వేడుకలను సైతం వైవిద్యంగా తెలుగు చిత్రరంగానికి నెలవైన నాలుగు ప్రాంతాల్లోనూ జరిపారు. ఆ తరువాత చిరంజీవి నటించిన 'మెకానిక్ అల్లుడు' 1993 మే 27న విడుదలైనా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచీ మళ్ళీ  మే నెలలో చిరంజీవి సినిమా విడుదల కాలేదు. దాదాపు 38 సంవత్సరాల తరువాత చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' మే నెలలో జనం ముందుకు రానుంది. 

ఈ సారి మే 13వ తేదీ గురువారం వచ్చింది. 1991లో 'గ్యాంగ్ లీడర్' సైతం మే 9న గురువారం వచ్చింది. అలా ఈ సారి కూడా 'ఆచార్య'కు గురువారం కలసి వస్తుందని భావిస్తున్నారు. పైగా ఆ రోజు రోహిణీ నక్షత్రం  ఉండడంతో చిరంజీవి హోరోస్కోప్ కు అది మరింత మంచిదనీ చెబుతున్నారు. అదే రోజున రంజాన్ కూడా వచ్చే  అవకాశం ఉందనీ తెలుస్తోంది . ఆ రోజు సెలవయితే, 'ఆచార్య' ఓపెనింగ్స్ ఏ తీరున ఉంటాయో చెప్పక్కర్లేదనీ అంటున్నారు.  మరి ఈ యేడాది మే 13న వచ్చే 'ఆచార్య' ఏ తీరున అలరిస్తాడో చూడాలి.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్