జిల్లా కేంద్రం లో ఈ నెల 16 వ తేదీ న గొర్రెల పంపిణీ కార్యక్రమం
*జిల్లా కేంద్రం లో ఈ నెల 16 వ తేదీ న గొర్రెల పంపిణీ కార్యక్రమం*
*కార్యక్రమం లో పాల్గొననున్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, రాష్ట్ర పురపాలన,పట్టణ అభివృద్ధి, ఐ.టి. శాఖ మంత్రి కె. టి.ఆర్., విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి,రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి శాఖ మంత్రి టి. శ్రీనివాస్ యాదవ్*
నల్గొండ,జనవరి 9.ఈ నెల 16 వ తేదీన జిల్లా కేంద్రం లో గొర్రెల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ధి,సినిమోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమోటగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లా కేంద్రం లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎం.పి.లు,ఎం.ఎల్.సి.లు,శాసన సభ్యులు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని,జిల్లా కేంద్రం లో పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమం లో 250 యూనిట్ ల గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు,అనంతరం జిల్లా లో పంపిణీ కార్యక్రమం కొన సాగుతుందని ఆయన అన్నారు.
Comments
Post a Comment