తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కేంద్ర ప్రభుత్వ 3446 ఉద్యోగాలు.

 



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కేంద్ర ప్రభుత్వ 3446 ఉద్యోగాలు.

అర్హత పదవ తరగతి
పోస్టల్ ఉద్యోగాలు


.తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్  విడుదల చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో మొత్తం 3446 ఖాళీలు ఉండగా.. అందులో ఏపీలో 2296, తెలంగాణలో 1150 ఉన్నాయి. ఇందులో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్,  అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,  డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు..
పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు మాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో మంచి మార్కులు సాధించాలి. వయస్సు జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు పదేళ్లు వయో సడలింపు ఇచ్చారు. ఇతర వివరాలు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు, పదో తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్‌, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది ఫిబ్రవరి 26.
అభ్యర్థులు మూడు స్టేజ్ లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి స్టేజ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ స్టేజ్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ ను ఆన్లైన్ లో తేదా హెడ్ పోస్టాఫీసుల్లో ఆఫ్ లైన్ లో చెల్లించవచ్చు. అనంతరం మూడో స్టేజ్ లో అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.

 
ఈ క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

https://appost.in/gdsonline/home.aspx
https://appost.in/gdsonline/home.aspx

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!