బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వాకర్స్ తో నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన


 బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి వాకర్స్ తో  నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన 



నల్గొండ  స్థానిక ఎన్జి కళాశాలలోని వాకర్స్  సభ్యులను కలసి ప్రచారం నిర్వహించిన  బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి. ఈ ప్రచారానికి  అనూహ్య స్పందన  లభించింది.  పలువురు వాకర్స్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకే భవిష్యత్తు ఉన్నదని మా  సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కొందరు మైనార్టీ సోదరులు ప్రేమిందర్ రెడ్డికి  సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ప్రేమేందర్ రెడ్డి. మాట్లాడుతూ  ఉద్యోగ, నిరుద్యోగ సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.  తెలంగాణ లో కేంద్ర  పధకాలను కేసీఆర్ అమలు పర్చక ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం నుండి అన్ని రకాల నిధులు రప్పించి అభివృద్ధి  కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్,  బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మొరిశెట్టి నాగేశ్వర్ రావు, చర్లపల్లి గణేష్, మాజీ కౌన్సిలెర్స్ రావిరాల వెంకట్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి,  బొజ్జ నాగరాజు,  దాయం భూపాల్ రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, పెరిక మునికుమార్, కిషన్, బలరాం, గడ్డం మహేష్,  గుండెబోయిన కొండల్, జగ్జీవన్ మరియు మహిళ మోర్చా నాయకురాళ్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

 


       


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్