కొమురవెళ్ళి మల్లన్నను దర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త


 కొమురవెళ్ళి మల్లన్నను దర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

 కోమురవెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం సందర్భంగా.. శనివారం రోజున  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతిసమేతంగా కోమురవెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామి వార్లను దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వార్లకు కోరమీసాలు సమర్పించి మెుక్కులు చెల్లించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ నుండి టూరిజం బస్ హైదరాబాద్ నుండి కోమురవెళ్ళి దేవాలయంనకు ఎర్పాట్లు చేస్తానని తెలిపారు. 

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో చర్చించి కొమురవెళ్ళిలో టూరిజం హోటల్ (హరిత) ఎర్పాటు తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ చైర్మెన్(ఐవిఎఫ్) వంగపల్లి అంజయ్య స్వామి, మంచాల శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు, ఐవిఎఫ్ నాయకులు, కొమురవెళ్ళి ఆర్యవైశ్య సంఘం నాయకులు బుచ్చిలింగం గుప్తా తోపాటు ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్