కేసీఆర్ కు అల్టిమేటం ఇచ్చిన బండి సంజయ్
జనగాం ఘటనపై 24 గంటల్లో కేసీఆర్ స్పందించాలని
జనగామలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలపై పోలీసులు అప్రజాస్వామికంగా, నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు, లాఠీచార్జ్ లను ప్రోత్సహిస్తూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జనగాంలో పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తలను ఆయన పరామర్శించారు. బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు.
బీజేపీ కార్యకర్తలు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరిపితే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు.
అసలు వివేకానందుడి ఫ్లెక్సీ పెడితే అభ్యంతరం ఏంటిని, లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలిని, జనగాం మున్సిపల్ కమిషనర్, దాడి చేసిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలిని డిమాండ్ చేశారు. బిజెపి కార్యకర్తలపై పోలీసులు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోందని, బిజెపికి ఏయే ప్రాంతాల్లో పట్టు ఉందో ఆయా ప్రాంతాల్లో, పోలీసులు బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని. సీఎం డైరెక్షన్ లో కొంతమంది ఐపీఎస్ అధికారుల సూచనలతో మా కార్యకర్తలను రక్తం వచ్చేలా కొడుతున్నారని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వర్థంతి సందర్భంలోనూ, స్వామి వివేకానంద గారి జయంతి సమయంలోనూ కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రాలేదని విమర్శించారు. భారత్ మాతా కీ జై, స్వామి వివేకానందకు జై అని నినదించిన వారిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అని అన్నారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏమి చెప్పదల్చుకున్నాడని ప్రశ్నించారు.
దసరా పండగ వేళ నల్గొండలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన 20 మంది బిజెపి కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారని, ఇప్పుడు జనగాంలో బిజెపి కార్యకర్తలపై నిర్ధాక్షిణ్యంగా దాడులకు తెగబడ్డారని, ఇంకా ఎంతమంది బిజెపి కార్యకర్తల రక్తం కళ్ళారా చూడాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. భయపడటానికి మేమేం టీఆర్ఎస్ మంత్రులం, కార్యకర్తలం కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడుతామని, కేసీఆర్ అరాచక, గడీల, నియంతృత్వ పాలనను బద్దలుకొడతామని హెచ్చరించారు.
కేసీఆర్ కు 24 గంటలు టైం ఇస్తున్నమని, జనగాం ఘటనపై స్పందించాలని అల్టిమేటం ఇచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. దెబ్బకు దెబ్బ తీస్తాం అని అన్నారు.
జనగాం ఘటనపై కేసీఆర్ 24 గంటల్లో స్పందించాలని
అల్టిమేటం ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్

Comments
Post a Comment