చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన


 చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన


*దారి లేని ప్రమాదకర జారుడు బండరాళ్లపై నుండి కాపురాల గుట్టను అధిరోహించి గుట్టను  సందర్శించిన. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి


*త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు*


 *ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం*

.

నేడు  నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లగొండ కు సింహద్వారాలు గా ఉన్న  లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్ట ల ను  పర్యాటక,  సుందర ప్రదేశాలు గా తీర్చిదిద్దడానికి మొడటి అడుగు వేశారు.  ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మం గారి గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ లు  సిద్ధం చేయగా, 

 ప్రస్తుతం నల్గొండ శాసనసభ్యుల మదిలో చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకోపార్క్ గా  అభివృద్ధి చేయటానికి బీజం పడింది ఈరోజు ఎక్కడానికి దారి లేక జారుడు బండ రాళ్లపై నుండి అత్యంత ప్రమాదకర దారి నుండి కాపురాల గుట్ట ను  అధిరోహిస్తూ నల్లగొండ కిరీటం లో మరో మణి నీ పొదగడానికి ఆలోచన చేశారు గుట్టపై వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఏ విధంగా గుట్టపై అభివృద్ధి కి అవకాశాలు ఉన్నాయో పరిశీలించారు..

 ఇప్పటికే పానగల్ కేంద్రంగా, ఉదయ సముద్రాన్ని నల్లగొండ టాంక్ బండ్  గా అభివృద్ధి, పరిర దేవాలయాలఅభివృద్ధి, వేదపాఠశాల, వల్లభ రావు చెరువు మినీ ట్యాంక్ బండ్, బైపాస్ రోడ్లు,  తదితర అభివృద్ధి కార్యమాలపై దృష్టి పెట్టిన కంచర్ల ఇప్పుడు కాపురాల గుట్టను ఎకోపార్క్ గాఅభివృద్ధి కి అవకాశాలను పరిశీలించడానికి  అత్యంత సాహసోపేతంగా గుట్టను అధిరోహించారు.. 

 వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్,  వాడ్రేవు మల్లిబాబు,  సెరి కల్చర్ సమన్వయ కమిటీ సభ్యులు పుండరీకం  prtu నాయకులు బిక్షంగౌడ్ రఘునందన్ రావు  మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి వెంకట రమణ రావువెంకటరమణ రావు పురుషోత్తం రెడ్డి  మాతంగి అమర్లకడపురం వెంకన్న రమేష్ చంద్ర మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  శరత్, మహేష్, చోటు  వెంకటేశ్వర్లు తదితరులు వెంట ఉన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్