హన్మంత్ పై దాడి అప్రజాస్వామికం :అల్లం


 హన్మంత్ పై దాడి అప్రజాస్వామికం :అల్లం


హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, లోక్ జాగారణ్ ఎడిటర్ ఆల్వాల హన్మంత్ పై దాడి ఆప్రజాస్వామికమని టీయూడబ్ల్యూజే 143 అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం హన్మంత్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా భానాపూర్ పట్టణంలో లోక్ జాగారణ్ తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆల్వాల్ హన్మంత్, షత్రిక కార్యాలయంపై దాడి చేయడం అమానుషమన్నారు. ఈనెల 13న హైదరాబాద్ కు వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా కార్యాలయానికి చేరువలోకి రాగానే బస్సులో నుంచి సుమారు 15 మంది దుండగులు హన్మంత ను దించివేసి ఈడ్చుకుంటూ కార్యాలయంలోకి లాక్కెళ్లడం రెండుగంటల పాటు నిర్భంధించడం సహేతుకం కాదన్నారు. హన్మంత్ పై దాడిచేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ హన్మంత్ కు యూనియన్ అండగా నిలుస్తుందని టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ యాతాకుల అశోకలు భరోసా కల్పించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకునేందుకు యూనియన్ ప్రతినిధులు చొరవ చూపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్