కేటీఆర్ ని కలిసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల .
ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ని కలిసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
తెలంగాణ రాష్ట్ర వర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ని కలిశారు. ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆయన కేటీఆర్‌కు పుష్పగుచ్చం అందజేశారు. తెలంగాణాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈ.డబ్ల్యూ.ఎన్) 10 శాతం ఇచ్చినందుకు కేటీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. ఈ సందర్బంగా టూరిజం కార్పోరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్నందుకు కేటీఆర్ అభినందించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని జిల్లాలు తిరిగి మరింత కష్టపడాలని ఆయన చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళుతుందన్నారు.
Comments
Post a Comment