బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలోబండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.
బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి: తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు
ఏపీ ప్రభుత్వం, వైసీపీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.
సోమవారం రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతమవ్వబోతున్నాయని జోస్యం చెప్పారు. ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన ఆయన.. వైసీపీ రెండు కొండలు అంటోందని.. ‘ఏడు కొండలవాడా గోవిందా గోవిందా’ అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామన్నారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. హిందువుల కానుకలను దారి మళ్ళిస్తోందని ఆరోపించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులకు ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందని, తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని పేర్కొన్నారు.
Comments
Post a Comment