*శిశు గృహ,చిల్డ్రన్ హోమ్,వృద్ధాశ్రమం వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ) ప్రతిమా సింగ్*
*శిశు గృహ,చిల్డ్రన్ హోమ్,వృద్ధాశ్రమం వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ) ప్రతిమా సింగ్*
నల్గొండ,జనవరి 5.నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచన మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,ఉద్యోగ సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు అందచేసిన106 దుప్పట్లు,బ్లాంకెట్ లను అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ)ప్రతిమా సింగ్ శిశు గృహ,చిల్డ్రన్ హోమ్,వృద్ధాశ్రమం ల లోని వృద్ఫులకు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రం లోని చిల్డ్రన్ హోమ్ కు 8 బెడ్ షీట్ లు,8 బ్లాంకెట్ లు,శిశు గృహ కు 10 బెడ్ షీట్ లు,10 బ్లాంకెట్ లు,గంధంవారి గూడెం మెయర్స్ బాల భవన్ కు 10 బ్లాంకెట్ లు,కలెక్టరేట్ దగ్గర ఉన్న శాంతి మహిళా మండలి కి 20 బెడ్ షీట్ లు,20 బ్లాంకెట్ లు,నార్కట్ పల్లి లోని ఆదరణ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ కి 10 బెడ్ షీట్ లు,10 బ్లాంకెట్లు మొత్తం అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పంపిణీ చేశారు. నూతన్ సంవత్సరం సందర్భంగా బొకే లు, స్వీట్ లకు బదులుగా స్వచ్ఛందంగా ఇవ్వదలుచుకుంటే బెడ్ షీట్ లు,బ్లాంకెట్ లు ఇవ్వ వచ్చని కలెక్టర్ సూచన మేరకు పలువురు అధికారులు,సంస్థలు జిల్లా కలెక్టర్ కు అంద చేసిన విషయం విదితమే.చలి కాలం లో వృద్ఫులకు,పిల్లలకు ఉపయోగ పడతాయనే ఉద్దేశం తో జిల్లా కలెక్టర్ సూచన మేరకు పలువురు తమ ఉదారత చాటుకొని స్వచ్ఛందంగా అంద చేశారు
Comments
Post a Comment