నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభం





 నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం 

ప్రారంభం

నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భసంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగనిరతి, నిబద్దత, ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతాయని  అన్నారు..... అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోష్ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జనగణమన ఉత్సవసమితి ఆధవ్వర్యలో నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు... పట్టణంలోని స్ధానిక సుభాష్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జడ్జి రమేష్ బాబతో పాటు ఎస్పి రంగనాధ్ తో కలిసి మండలి చైర్మన్ గుత్తా పాల్గొన్నారు... ఈసందర్భంగా వారు ముందుగా జాతీయపతాకావిష్కరణ చేసి ముందుగా నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు... అనంతరం ఆజాద్ హిందుఫౌజ్ జండాకూడా ఆవిష్కరించి నేతాజి జయంతి వేడుకలలో పాల్గొన్నారు... విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహం వద్ద జైహింద్ నినాదాలు చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుడు, అద్వితీయ చరిత్ర కలిగిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి. జైహింద్ నినాధంతో దేశాన్ని ఒక్కతాటి పై నిలిపి అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుని జన్మదిన సందర్బంగా నల్లగొండ పట్టణంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.... జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ.... నేతాజి వంటి దేశ భక్తులు దేశానికి అవసరమని అన్నారు.... వారు చూపిన తెగువ కూడా  మన దేశం స్వత్రంత్ర్యాన్ని సాధించుకోవడానికి బాటలు వేసిందని అన్నారు... కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సామాజాక కార్యక్రర్త వెంకట శివకుమార్ మాట్లాడుతూ... పుట్టుకే కాని చావులేని వీరుడు మన సపుభాష్ చంద్రబోస్ అన్ని అన్నారు... బ్రిటీష్ పాలను అణచివేసేందుకు అలుపెరుగని పోరాటం చేసి... పరక్రమ శాలీగా ప్రఖ్యాతి సాధించారని అలాంటి ఈ రోజును ప్రరాక్రమ దినోత్సవం దేశమంత జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. యువతలో దేశభక్తి, జాతీయత సమైక్యభావం పెంపొందించడమే లక్ష్యంగా పట్టణంలో నిత్యం జాతీయ గీతాలాపన చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు... జమ్మికుంటలో మొదలైన ఈ ప్రస్ధానం దేశం మొత్తం సాగాలని ఆకాంక్షించారు...

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్