అంగడిపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు గంగిడి, కంకణాల పరామర్శ
అంగడిపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు గంగిడి, కంకణాల పరామర్శ
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కూలీ పనులకై వెళ్లి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ఆటోను డ్రైవర్ తప్పిదం కారణంగా లారీ ఢీకొనగా, 9 మంది దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలాని డిమాండ్ చేయగా భాజపా శ్రేణులను అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ ఒత్తిడి కారణంగా జిల్లా మంత్రి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియ మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రకటించారని బీజేపీ నాయకులు తెలిపారు.
అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున ( 9 కుటుంబాలు) ఆర్థిక సహాయాన్ని బిజెపి నల్గొండ జిల్లాధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి మరియు నియోజికవర్గ నాయకులు కేతావత్ లాలు నాయక్ తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా||జి.మనోహర్ రెడ్డి అందజేశారు
Comments
Post a Comment