జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం
*జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం*
* *జిల్లా కలెక్టర్,జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారితో కలిసి డ్రై రన్ ప్రక్రియ పర్యవేక్షణ*
* *నల్గొండ జిల్లా కేంద్రం లో పానగల్,లైన్ వాడ అర్బన్ హెల్త్ సెంటర్ లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, మాన్యం చెల్క,రాముల బండ పిహెచ్.సి లలో డ్రై రన్ ను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*
నల్గొండ,డిసెంబర్ 8.కోవిడ్ టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో డ్రై రన్ కార్యక్రమం విజయవంతం గా నిర్వహించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 47 కేంద్రాల్లో ముందుగా రిజిస్టర్ చేసుకున్న 1175 మంది వైద్య ఆరోగ్య శాఖ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి శుక్రవారం నమూనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నినిర్వహించారు. 47 కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం లో రిజిష్టర్ చేసుకిన్న 25 మంది వైద్య,ఆరోగ్య సిబ్బందికి నమూనా వ్యాక్సి సెషన్ నిర్వహించారు.నల్లగొండ పట్టణంలోని పానగల్ , లైన్ వాడ అర్బన్ హెల్త్ సెంటర్ లలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం,మాన్యం చెల్క,రాముల బండ పి.హెచ్.సి .కేంద్రాల్లో డ్రై రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,కమిషనర్,కుటుంబ సంక్షేమ శాఖ నుండి జిల్లా పరిశీలకు రాలు డా.రజని తో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ ను పర్యవేక్షించారు. టీకా నిర్వాహణలో ఎదురయ్యే లోపాల్ని అధిగమించడంతో పాటు సిబ్బందికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.టీకా పంపిణీ కి ముందస్తు ఏర్పాట్లు లో భాగంగా ఈ డ్రై రన్ నిర్వహణకు 3000 మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి శిక్షణ నిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.పకడ్భందీ ఏర్పాట్ల నడుమ ,జిల్లా ,మండల టాస్క్ ఫోర్స్ బృందాల పర్యవేక్షణలో జిల్లాలో డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు... సాంకేతికంగా తలెత్తె సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అన్నారు.ప్రతి కేంద్రంలో మూడు గదుల్ని ఏర్పాటు చేశామని, కొవిడ్ టీకా వేసుకోవాడానికి వచ్చిన వారు కూర్చోని వారి పేరును ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడానికి ఒక గదిని, టీ కా వేయడానికి మరో గదిని, టీకా వేసిన తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో అర్ద గంట పాటు ఉండటానికి మొత్తం మూడు గదుల్ని ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెల్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రతి ఒక్కరికి టీకా అందించేలా సర్వసన్నద్దంగా ఉన్నట్లు కలెక్టర్ తెల్పారు.ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి మొదటి దశ లో,రెండవ దశ లో పోలీస్,మున్సిపల్ పారిశుధ్య,ఇతర
ప్రంట్ లైన్ వారియర్స్ కు,తర్వాత 50 సంవత్సరాలు దాటి దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న వారు,కోవిన్ ఆప్ లో నమోదు అయిన వారికి దశల వారీగా కోవిడ్ టీకా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేయనున్నట్లు తెలిపారు. లైన్ వాడ పట్టణ ఆరోగ్య కేంద్రం లో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.రామ్మోహన్ రావు,జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిప్యూటీ డి.యం. హెచ్ ఓ డా.అరుంధతి పర్యవేక్షణ లో కోవిడ్ డ్రై రన్ నిర్వహించారు.
Comments
Post a Comment