భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సాగు నీటి కోసం రైతుల ధర్నా


 

*భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సాగు నీటి కోసం రైతుల ధర్నా* 

పెద్దవుర మండలం కొత్తలురు గ్రామం వద్ద చెపురు చెరువుకు నుండి కొత్తలూరు వచ్చె నీటి వినియోగం కోసం ఆ గ్రామంలో *చెక్ డ్యాం* ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది కాని చెక్ డ్యామ్ ఏర్పాటు చేసిన కానీ పక్కన తూము ద్వారా నీటి దిగువకు ఇస్తే 200 ఎకరాల వరకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అని రైతులు ఓక తూమును ఏర్పాటు చెయ్యాలని రైతులు ధర్నా నిర్వహించడం జరిగినది... విషయం తెలుసుకున్న బీజేపి జిల్లా అధ్యక్షులు *కంకణాల శ్రీధర్ రెడ్డి* గారు ధర్నా కు సంఘీభావం తెలిపారు... అనంతరం సంబంధిత అధికారి DE గారితో మాట్లాడి ప్రస్తుతం నీటి వినియోగం కోసం నీరు వృధా కాకుండా ప్రక్కనే చిన్నా కాలువ ఏర్పాటు వ్యవస్థను శ్రీధర్ రెడ్డి గారు దగ్గర వుండి ఆ కాలువ పనులు పూర్తి చేపించారు...


ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి , పెద్దవూర మండల అధ్యక్షులు ఎరుకొండ నర్సింహ , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నులక వెంకట్ రెడ్డి గారు , కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు శంకర్ రావు , కత్తి శంకర్ రెడ్డి , రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్