మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి పది రోజుల జైలు, జరిమానా, లైసెన్స్ రద్దు : ట్రాఫిక్ సిఐ అనిల్
*
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి పది రోజుల జైలు, జరిమానా, లైసెన్స్ రద్దు : ట్రాఫిక్ సిఐ అనిల్*
- - 24 మందిని కోర్టులో హాజరు పరిచిన ట్రాఫిక్ పోలీసులు
- - పలువురికి జైలు, జరిమానా, రెండు నెలల లైసెన్స్ రద్దు
- - ప్రమాదాల నివారణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
నల్లగొండ : మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి పది రోజుల జైలు శిక్ష, రెండు నెలల లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా రెండవ తరగతి న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ తెలిపారు.
సాధారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఒకటి నుండి అయిదు రోజుల పాటు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని కానీ తొలిసారిగా నల్లగొండకు చెందిన సి.హెచ్. శ్రీధర్ అనే వ్యక్తికి శుక్రవారం పది రోజుల జైలు శిక్ష, రెండు నెలల పాటు లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన ద్వారా మూడు రకాల శిక్ష విధించడం జరిగిందని చెప్పారు. మొత్తం 24 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా వారిలో వి.నర్సింహా రావుకు ఒక రోజు జైలు, వెయ్యి రూపాయల జరిమాన, జి. అంజయ్యకు మూడు రోజుల జైలు, రెండు నెలల లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన, వంశీ కి రెండు రోజుల జైలు, వెయ్యి రూపాయల జైలు, కె. నరేష్ కు రెండు నెలల లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన, జే. వెంకన్న కు రెండు నెలల లైసెన్స్ రద్దు, ఒక రోజు జైలు, వెయ్యి రూపాయల జరిమానా, సి.హెచ్. మల్లేష్ కు వెయ్యి జరిమానా, రెండు నెలలు లైసెన్స్ రద్దు, ఒక రోజు జైలు శిక్ష, ఎస్. విష్ణుకు నాలుగు రోజుల జైలు, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా రెండవ తరగతి న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు అనిల్ కుమార్ వివరించారు. మిగిలిన 16 మందికి ఒక్కొక్కరికి 1500 చొప్పున జరిమానా విధించడం జరిగిందని, మొత్తం 24 కేసులకు గాను 32,000 రూపాయల జరిమాన విధించినట్లు ఆయన తెలిపారు.
వాహనాలు నడిపే వారంతా పోలీసులతో సహకరించాలని, మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం జరిమానా, 10 రోజులకు పైగా జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్సుల రద్దు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ వివరించారు.
Comments
Post a Comment