నల్లగొండ లో.. IT హబ్, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయమని కేటీఆర్ ను కోరిన ఎమ్మెల్యే కంచర్ల


 నల్లగొండ లో.. IT హబ్, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయమని  కేటీఆర్ ను కోరిన ఎమ్మెల్యే  కంచర్ల


నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  ప్రగతిభవన్ లో పురపాలక,  ఐటీ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని కలుసుకొని నూతన సంవత్సర  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నల్లగొండ లో.. IT హబ్, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయమని కోరిన ఎమ్మెల్యే . MG యూనివర్సిటీ ని NACC చే గుర్తించబడే  A గ్రేడ్ పొందుటకు కావలసిన మౌలిక వసతులఏర్పాటుచేయాలని, సెరి కల్చర్  మల్బరీ  రైతుల ప్రోత్సాహకాలు విడుదల చేయించాలని  విజ్ఞప్తి చేశారు. 

నల్గొండ ను  IT హబ్ తో  ద్వితీయ శ్రేణి నగరంగా సాంకేతిక రంగంలో  అభివృద్ధి పరచాలని, రాష్ట్ర రాజధాని కి అతి దగ్గరగా వున్న ప్రాంతమని,  ప్రతిపాధిత రీజనల్ రింగు రోడ్డు కు కేవలం నలభై కిలోమీటర్ల దూరం లో ఉండడం  అంతర్జాతీయ విమానశ్రాయం అందుబాటులో ఉండడం  మరియు నల్గొండ కు చెందిన NRI లు స్పెల్ బి కంపెనీ అధినేత పాశం కిరణ్ రెడ్డి, మరో కంపెనీ అధినేత పల్రెడ్డి శ్యామ్ తమ సంస్థల ను నల్లగొండ  లో ఏర్పాటు కు  సంసిధత వ్యక్తం చేశారని,  దాదాపుగా ఇరవై కంపెనీ లు, బిపిఓ కేపీఓ కంపెనీ లు సైతం తమ సంస్థ ల ఏర్పాటు కు  సానుకూలంగా స్పందించినవని, మొదటి దఫాలోనే   పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాల కల్పన కు అవకాశం ఇవ్వాలని   ktr ను కొరినట్లు ఎమ్మెల్యే కంచర్ల తెలిపారు. అదేవిధంగా ముందడుగు వేద్దామని కేటీఆర్ అన్నారని  ఆయన తెలిపారు. 

పట్టు రైతులకు రెండు ఏండ్లు గా ప్రభుత్వం నుంచి బకాయి వున్న మల్బరీ రైతుల  ప్రోత్సహక డబ్బులు దాదాపుగా ఐదు కోట్లు ఉండగా వాటికి రాష్ట్ర వ్యాప్తంగా నాల్గు వేల మల్బరీ రైతులు లబ్ధిదారులు గా వున్నారు అందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అభ్యర్థించనట్లు ఆయన తెలిపారు. దానికి కేటీఆర్  సానుకూలంగా స్పందించి. తగు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చనట్లు కంచర్ల తెలియచేసారు .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్