బాలిక పై 17 మంది......
కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. చిక్కామంగళూరు జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలికపై 17 మంది కామాంధులు గత ఐదు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనపై చిక్కామంగళూరు జిల్లా శ్రీంగేరి పోలీసులకు జిల్లా బాలల సంక్షేమ సంఘం ఛైర్మన్ ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషింగ్ యూనిట్ లో 15 ఏళ్ల బాధిత బాలిక పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది.మొదట బాలికపై బస్సు డ్రైవరు గిరీష్ అత్యాచారం చేశాడు. బస్సు డ్రైవరు అందించిన సమాచారంతో అభి అనే మరో యువకుడు బాలికపై అత్యాచారం చేసి ఆమె అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం అభి స్నేహితులు అశ్లీల ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారు కూడా అత్యాచారం చేశారు. బాధిత బాలిక తల్లి మరణించడంతో ఆమె అత్త ఇంట్లో నివాసముంటోంది.
Comments
Post a Comment