గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్
*గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్*
నేరం నెంబర్ 124/2021
U/s 429,153,153-A IPC and
Sec 10 of prohibition of cows slaughter Act, and Sec 11 of prevention of cruelty to animal Act.
పోలీస్ స్టేషన్ సిద్దిపేట వన్ టౌన్
*నిందితుల వివరాలు*
1. మహ్మద్ జుబేర్ తండ్రి షఫీ, వయస్సు 45 సంవత్సరములు, నసిర్ నగర్ సిద్దిపేట.
2. మహ్మద్ ఖాజా తండ్రి బాబామియా, వయసు 35 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట.
3. మహ్మద్ సద్దాం తండ్రి మహబూబ్ సాబ్, వయస్సు 30 సంవత్సరములు,
సాజిద్ పుర సిద్దిపేట.
4. మహ్మద్ అరఫత్ తండ్రి వసీం, వయస్సు 24 సంవత్సరాలు, సాజిద్ పుర సిద్దిపేట.
5. మహ్మద్ ఇబ్రహీం తండ్రి మహబూబ్, వయసు 32 సంవత్సరములు,సాజిద్ పుర సిద్దిపేట.
6. మహ్మద్ హర్షద్ తండ్రి ఉమన్, వయస్సు 25 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట.
7. మహ్మద్ ఆరాఫ్ తండ్రి ఇబ్రహీమ్, వయస్సు 30 సంవత్సరములు,
సాజిద్ పుర సిద్దిపేట.
8. మహ్మద్ జావిద్ తండ్రి బాసిత్, వయసు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. మరియు ఇతరులు
ఈరోజు సాయంత్రం అందాజ 6:30 గంటల సమయమున సిద్దిపేట శివారు సిరిసిల్ల వెళ్లే బైపాస్ రోడ్ లో పై నిందితులు ఇటుక బట్టీల వెనుక ఉన్న రేకుల షెడ్లులో ఆవులను గోవధ చేసినారని నమ్మదగిన సమాచారం రాగా వెంటనే పోలీస్ అధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గోవధ చేసిన ఆవులను పరిశీలించి, షెడ్డులో కట్టి వేసిన ఆవులను గోశాలకు పంపించడం జరిగింది. గోవధ చేసిన ఆవుల గురించి వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్టుమార్టం చేయించడం జరిగింది. దీనికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సిద్దిపేట జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ముఖ్య గమనిక జిల్లాలో ఎవరో కొంతమంది చెప్పే పుకార్లు నమ్మవద్దని,నేరస్థులు ఎంతటివారినైనా వదిలిపెట్టమని సిద్దిపేట జిల్లాలో ఎక్కడ ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాలు పడితే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.
Comments
Post a Comment