బీజేపీ దే విజయం - బీజేపీ నాయకులు గొంగిడి మనోహర్ రెడ్డి, మాదగోని, కంకణాల శ్రీధర్ రెడ్డి
బీజేపీ దే విజయం - బీజేపీ నాయకులు గొంగిడి మనోహర్ రెడ్డి, మాదగోని, కంకణాల శ్రీధర్ రెడ్డి
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు తీవ్రమైన ఆక్షేపనీయమని, సీఎం మొఖంలో ఆందోళన అబద్రత కొట్టొచ్చినట్టు కనిపించిందిని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా బిజెపి కార్యాలయం లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ కేసీఆర్ పైకి గాంభీర్యం ప్రదర్శించారని, ఆయన ప్రసంగం టేప్ రికార్డ్ చెసినట్లు పేలవంగా సాగిందని, నల్గొండ లో ఏం అభివృద్ధి చేశారో చెప్పలేదని విమర్శించారు.సీఎం అహంకారం పరాకాష్ట కు చేరిందని, ఫీల్డ్ అసిస్టెంట్ లు, గిరిజనులు, విద్యుత్ ఆర్టిజైన్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని వారిని కుక్కల తో పోల్చడం ఎంత వరకు సమంజసమని, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి సీఎం ఎవరు లేరని అన్నారు.
ఆయన మాట్లాడిన మాటలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గిరిజన భరోసా యాత్ర పెట్టిన తరువాతే కేసీఆర్ గిరిజనుల గురించి మాట్లాడారని, కుర్చీ వేసుకుని ఎస్సెల్బిసి పూర్తి చేస్తా అన్నారని, ఇప్పటికి గతిలేదని నల్గొండ జిల్లా పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్నారు. కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేసినని అన్నారు. ఇప్పటి వరకు ఆ లిఫ్ట్ ల ఊసే లేదని అన్నారు. ఎస్సి సబ్ ప్లాన్ కింద నిధుల ఊసేలేదని ఎస్సి కార్పొరేషన్ కు నిధులే లేవుని ఇపుడు కొత్తగా దళిత నిధి అంటున్నడని, ఎస్టీ లకు 12 శాతం రిజర్వేషన్ ఊసే లేదని, నల్గొండ ప్రజలు తీవ్రంగా మోసానికి , దగా కు గురయ్యారని తెలిపారు.మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో అధ్యాపకుల నియామకాలు లేవని, మున్సిపాలిటీ లో గతంలో ప్రకటించిన హామీలే నెరవేర్చలేదని..ఇపుడు కొత్తగా కోట్లు ఇస్తా అంటున్నాడని విమర్శించారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల భూ కబ్జాలు, అవినీతి ఇవేమీ కెసిఆర్ కు పట్టవని, రైతు వేదికలు కేవలం టిఆర్ఎస్ నాయకులకు గోదాముల కు మాత్రమే పనికి వస్తాయని అన్నారు. సీఎం పదవిని చెప్పుతో పోల్చాడం కెసిఆర్ ఎంత అహంకారో తెలుస్తోందిని, బీరు, బిర్యాన్ని పెట్టి సభకు తీసుకొచ్చారని, రాబోయే కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ దే విజయమని అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ భజన సభ లాగానే ఉందిని, సభ వల్ల నిధులు బాగా వస్తాయని ఆశిస్తే..నిరాశే ఎదురైంద ని విమర్శించారు. నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని 100 కోట్లు ఇస్తా అని 10 కోట్లు ఇచ్చారని అన్నారు. బిజెపి ని కొత్త బిక్షగాళ్ళు అంటున్నాడని, గతం మరిచిపోయారా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ కంటే ముందే రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు వున్నారని తెలిపారు. సభకు తమ సమస్యలు తెలపడానికి వస్తే..కుక్కలు అని సంభోదించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారో టిఆర్ఎస్ నాయకులకు తెలపాలని సవాల్ చేశారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి గా కొనసాగే అర్హత లేదు..ఆయన అహంకారానికి సాగర్ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాగర్ లో సీఎం మీటింగ్ తోనే అర్థమైందని బిజెపి సాగర్ లో గెలవబోతుందని అన్నారు. ముఖ్యమంత్రి గతంలో చెప్పిన మాటలే మళ్ళీ చెప్పి వెళ్ళాడని, నెల్లికల్లు లిఫ్ట్ ను కుదించి గిరిజనులను మోసం చేస్తున్నారని, 25 వేల ఆయకట్టు ను, 4 వే ల ఆయకట్టు కు కుదించారని విమర్శించారు 7 యేండ్లు గా ఇవ్వని రేషన్ కార్డులు ఇపుడు ఇస్తారంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరని, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, ఇప్పటివరకు లేవన, చుట్టూ వున్న నియోజకవర్గాల నుండి ప్రజలను తరలించారని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులతోనే రైతు వేదికలు కట్టారని, ప్రతి ఒక్క సర్పంచి బిజెపి వైపు చూస్తున్నారని, నాగార్జున సాగర్ లో బిజెపి జెండా ఎగురవేస్తామని,..రాష్ట్రములో అధికారం లోకి వస్తామని తెలిపారు.
....
Comments
Post a Comment