సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
కరీమాబాద్‌లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్‌లో పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేస్తుండగా క్యాండిల్ ఒక్కసారిగా పేలింది.
ఆ మంటలు పేపర్లకు అంటుకోవడంతో.. నేతలు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే నరేందర్, ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నారు.
ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Post a Comment