ఆరుగురు టీచర్లు సస్పెండ్

 గవర్నమెంట్​స్కూల్​లో మందు తాగి, పేకాట ఆడిన ఎంఈఓ, ఆరుగురు టీచర్లను విద్యా శాఖ ఆర్జేడీ సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

ఆదిలాబాద్ జిల్లా బేల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​కోలా నర్సింహులు, బేల, తాంసి, భీంపూర్ మండలాల ఎడ్యుకేషనల్​ఆఫీసర్. అయితే ఇటీవల బేల స్కూల్​లో చెప్రాల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​ జీపీ జ్నానేశ్వర్, బేల జడ్పీహెచ్ఎస్​అసిస్టెంట్ సోనేరావు, బాది యూపీఎస్ అసిస్టెంట్​టి.నర్సింహస్వామి, సిర్సన్న, కరోని బి ఎంపీపీఎస్ లోని ఎస్ జీటీలు దేవురావు, అనంతరావులతో కలిసి మందు కొడుతూ, పేకాట ఆడారు. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో బాగా వైరల్ ​అయ్యాయి.

డీటీఎఫ్​ ఆర్జేడీతోపాటు విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూని సీరియస్​గా తీసుకున్న వరంగల్ ఆర్జేడీ కె.లింగయ్య బాధ్యులను డ్యూటీల నుంచి సస్పెండ్ ​చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారని డీఈఓ ఎ.రవీందర్​రెడ్డి తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్